AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ పోలీసు పోస్ట్‌పై బాంబులు విసిరిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు .. పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ఉగ్రవాదులు

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని మూసి ఉన్న పోలీసు పోస్టులపై ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబులు విసిరారు. దీంతో పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాదులను పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు దుండగులు తీవ్రంగా గాయపడ్డారు. పురాన్‌పూర్‌ సీహెచ్‌సీలో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు తదుపరి చర్యలను చేపట్టారు.

పంజాబ్ పోలీసు పోస్ట్‌పై బాంబులు విసిరిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు .. పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ఉగ్రవాదులు
Three Khalistani Terrorists Accused
Surya Kala
|

Updated on: Dec 23, 2024 | 9:09 AM

Share

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో పోలీసు పోస్టుపై గ్రెనేడ్‌తో దాడి చేసిన ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశారు. పిలిభిత్ జిల్లాలో యుపి పోలీసులతో కలిసి ఎన్‌కౌంటర్‌ చేయగా ఖలిస్తాన్ ఉగ్రవాదుల గాయపడ్డారు. ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఒకరి వద్ద నుంచి 2 ఏకే 47, రెండు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ ఘటన పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ సమీపంలో జరిగింది.

గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం పురంపూర్‌కు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు. హతమైన ఖలిస్థానీ ఉగ్రవాదులు గురుదేవ్ సింగ్ కుమారుడు 25 ఏళ్ల గుర్విందర్ సింగ్, మొహల్లా కలనౌర్ నివాసి, 23 ఏళ్ల వీరేంద్ర సింగ్ అలియాస్ రవి, రంజిత్ సింగ్ అలియాస్ జీత కుమారుడు, కలనౌర్ గ్రామం అగ్వాన్ పోలీస్ స్టేషన్‌ సమీపంలో నివాసం ఉంటున్న 18 ఏళ్ల వయస్సు గలవారు. జసన్ ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ కు సుమారు 18 సంవత్సరాలు. నిక్కా గ్రామ నివాసి. నిందితులు ముగ్గురూ గురుదాస్‌పూర్ వాసులు.

ఎన్‌కౌంటర్‌లో పిలిభిత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవినాష్ పాండే, ఎస్‌ఐ అమిత్ ప్రతాప్ సింగ్, ఇన్‌స్పెక్టర్ నరేష్ త్యాగి, ఎస్‌హెచ్‌ఓ పురాన్‌పూర్, ఎస్‌ఐ లలిత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జగ్వీర్, మాధోతండా ఎస్‌హెచ్‌ఓ అశోక్ పాల్, కానిస్టేబుల్ సుమిత్, హితేష్, ఇన్‌స్పెక్టర్ కెబి సింగ్, ఎస్‌ఐ సునీల్ శర్మ పాల్గొన్నారు. పంజాబ్ పోలీసు బృందంలోని మిగిలిన వారు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసు పోస్టులపై పేలుళ్లు

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పోలీసు పోస్టుల్లో పేలుళ్లు జరిగాయి. గత గురువారం రోజున మూసివేసిన పోలీసు పోస్ట్ బక్షివాల్‌పై దాడి జరిగింది. ఒక రోజు తర్వాత అంటే శుక్రవారం రాత్రి, మూసివేసిన మరొక పోలీసు పోస్ట్ వద్ద పేలుడు సంభవించింది. సిబ్బంది కొరత కారణంగా ఈ రెండు పోలీసు పోస్టులను ఇటీవల మూసివేశారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వడాలా బంగర్ పోస్ట్ వద్ద రాత్రి జరిగిన పేలుడుతో ప్రజలు వణికిపోయారని పోలీసులు తెలిపారు. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసరికి రాత్రంతా జాగారం చేస్తూ గడిపారు. ఆ తర్వాత రాత్రంతా పోలీసు వాహనాల సైరన్‌లు మోగుతూనే ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..