AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Puja Tips: శివయ్య పూజ సమయంలో పొరపాటున కూడా ఈ పనులు వద్దు.. లేదంటే ఏలినాటి శని వెంటాడుతుంది..

సోమవారం శివుడికి అంకితం చేయబడిన రోజు.. ఈ రోజున శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే సోమవారం మాత్రమే కాదు.. కొంతమంది రోజూ శివయ్యను పూజిస్తారు. వివిధ రకాల ద్రవ్యాలను పూజ కోసం ఉపయోగిస్తారు. అయితే శివయ్య పూజ లో కొన్ని నియమాలున్నాయి. ఇంట్లో మాత్రమే కాదు శివాలయం లో కూడా ప్రత్యేక పద్దతిలో భోలాశంకరుడిని ఆరాధించడం వలన అనుగ్రహం లభించి కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. ఈ రోజున శివ పూజ సముయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం..

Shiva Puja Tips: శివయ్య పూజ సమయంలో పొరపాటున కూడా ఈ పనులు వద్దు.. లేదంటే ఏలినాటి శని వెంటాడుతుంది..
Lord Shiva Puja
Surya Kala
|

Updated on: Dec 23, 2024 | 8:11 AM

Share

హిందువులు పూజించే దేవుళ్ళల్లో శివయ్య ఒకరు. సృష్టి లయకారుడు శివయ్యను పూజించడం అత్యంత సులభమని.. భక్తి శ్రద్దలతో నిర్మలమైన మనసుతో పూజించడం వలన శివయ్య అనుగ్రహంతో కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. అయితే శివయ్య పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా శివయ్య పూజ సమయంలో కొన్ని తప్పులు చేయవద్దు. కనుక శివ పూజ సమయంలో కొన్ని పొరపాట్లు చేయవద్దు. లేదంటే శని దోషం ఏర్పడుతుందని వేద పురాణాల పేర్కొన్నాయి. ఈ నేపధ్యంలో శివ పూజ చేసేట‌ప్పుడుఎలాంటి పొరపాట్లు చేయ‌కూడ‌దు..ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

  1. సృష్టి లయకారుడు శివుడికి అత్యంత ప్రీతికరమైనది భస్మం.. దీనినే విభూదిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదిటిన ధరించిన భక్తులను కాపాడుతూ ఉంటాడని పండితులు చెబుతున్నారు. కనుక విభూదిని నుదుటన మూడు గీత‌లు అడ్డంగా ధారణ చేయాలి. విభూదిని ఇలా ధరించడం వలన పాపాలు న‌శిస్తాయని నమ్మకం.
  2. శివయ్య పూజలో భస్మాన్ని ఉపయోగించాలి. కానీ పొరపాటున కూడా కుంకుమ శివయ్య పూజలో ఉపయోగించ వద్దు. లింగానికి కుంకుమ‌బొట్టు పెట్ట వద్దు. విభూది, గంధంతో మాత్రమే అలంకరణ చేయాలి.
  3. శివయ్య అభిషేకంలో జలం, చెరకు రసం, ద్రాక్ష రసం ఇలాంటివి ఉపయోగించవచ్చు. అయితే కొబ్బిరి నీళ్ళను మాత్రం శివలింగానికి అర్పించరాదు.
  4. శివాల‌యం చుట్టూ మాత్రం చేసే ప్రదక్షిణ విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్ర‌ద‌క్షిణలు చేయ‌కూడ‌ద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాల‌యంలో కేవ‌లం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి.
  5. శివ‌లింగానికి అభిషేకం ఆవు పాలతో చేయాలి. ముఖ్యంగా సోమవారం శివుడికి ఆవు పాలతో అబిషేకం చేయడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అయితే కొంతమంది పేకెట్ పాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. పాలను ఒక గ్లాస్ లోకి తీసుకుని అనంతరం అభిషేకం చేయాలి.
  6. సోమ‌వారం రోజున కైలాసం నుంచి భూమి మీదకు శివుడు వస్తాడని నమ్మకం. కనుక ఈ రోజు పూజ చేయడం.. ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత ఫలవంతం.
  7. శివయ్యకు అభిషేకం చేసే సమయంలో రాగి పాత్రను లేదా స్టీల్ పాత్రలు ఉప‌యోగించ‌కూడ‌దు. శివ‌లింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం.. నీటితో అభిషేకం చేయాలి.
  8. శివయ్యకు పూజ లేదా అభిషేకం చేసే సమయంలో శ‌రీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుక‌లు శివయ్యపై పొరపాటున కూడా పడవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుని పూజించాలి.
  9. ఒకవేళ ఇంటి పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే నిత్యం జ‌ల‌దార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
  10. తెలుపు రంగులో ఉండే పాల‌రాతి శివ‌లింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. ఇంట్లో ఒక శివ‌లింగం కంటే ఎక్కువ ఉండచుకోవద్దు.
  11. శివున్ని పూజించే ముందు వినాయ‌కుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో ఓం న‌మః శివాయ అనే మంత్రాన్ని జ‌పించాలి.
  12. నంది వర్ధనం పూల‌తో పూజ చేస్తే జీవితంలో సుఖ శాంతులు లభిస్తాయి. అదే విధంగా పారిజాత పూల‌తో శివుడికి పూజ చేస్తే కాల‌స‌ర్ప దోషాలు తొల‌గిపోతాయి.
  13. శివుడికి ఎరుపు రంగు పూల‌తో పూజ చేయ‌కూడదు. వెల‌గ‌పండును శివుడికి స‌మ‌ర్పిస్తే దీర్ఘాయుష్షు ల‌భిస్తుంది.
  14. సోమ‌వారం రోజున ముక్కోటి దేవ‌ల‌తో క‌లిసి లయకారుడు శివాల‌యంలో ఉంటాడ‌ని పురాణాలుపేర్కొన్నాయి. క‌నుక సోమవారం రోజున ఎవ‌రైతే శివాల‌యానికి వెళ్తారో వారికి క‌ష్టాలు లేకుండా శివుడు వ‌రం ఇస్తాడ‌ని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు