అడివి శేష్ సినిమాకు మృణాల్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..
Rajitha Chanti
Pic credit - Instagram
అడవి శేష్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ సినిమా డెకాయిట్. ఈ చిత్రానికి ముందుగా శ్రుతి హాసన్ హీరోయిన్ అనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ సైతం రిలీజ్ చేశారు.
అనుహ్యంగా ఈ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలోకి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వచ్చింది. ఇటీవలే ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు.
మృణాల్ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మృణాల్ తీసుకుంటున్న పారితోషికం తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.
ఈ సినిమా కోసం మృణాల్ ఏకంగా రూ.3.5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుందట. ఈ రెమ్యునరేషన్ శ్రుతి హాసన్ కంటే అధికమని అంటున్నారు
శ్రుతికి రెండున్నర కోట్లు ఆఫర్ చేయగా.. ఆమె తప్పుకున్న తర్వాత మృణాల్ కు మూడున్నర కోట్లు ఇవ్వడానికి సైతం మేకర్స్ ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.
మృణాల్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేయనప్పటికీ ఆమె పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.
చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన మృణాల్..ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అక్కడే వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటుంది.
తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంది.