23 December 2024

ఒకప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

సూపర్ హిట్ 7/జీ  బృందావన్ కాలనీ సినిమాలోని ఓ పాటలో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించిన ఓ అమ్మాయి ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. 

కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఆమె ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్. 

దశాబ్ధం పాటు అగ్ర కథానాయికగా ఇండస్ట్రీని ఏలింది కాజల్. తెలుగు, తమిళం భాషలలో దాదాపు టాప్ హీరోలతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. 

అయితే కాజల్ హీరోయిన్‌ కాకముందు చిన్న రోల్స్ చేసింది. అలాగే 7/జీ  బృందావన్ కాలనీ సినిమాలో ఓ పాటలో సైడ్ డ్యాన్సర్‌ కనిపించింది.

కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన కాజల్.. ఆ తర్వాత చందమామ సినిమాతో హిట్ అందుకుంది. 

ఆతర్వాత మగధీర సినిమాతో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్  బెస్ట్ చాయిస్‌గా నిలిచింది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. వీరికి బాబు జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. 

ఆ తర్వాత ఇండియన్ 2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన కాజల్..ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో కొన్ని చిత్రాల్లో నటిస్తుంది కాజల్.