Ear Piercing: చెవులు కుట్టడంలో మతపరమైన ప్రాముఖ్యత మీకు తెలుసా.. ఆరోగ్యానికి కూడా మేలు..

హిందూ మతంలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు 16 కర్మలు నిర్వహిస్తారు. ఈ 16 సంస్కారాల్లో  కర్ణవేద సంస్కారం కూడా ఒకటి. బాలబాలికలకు కర్ణవేధ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. పూర్వకాలంలో కర్ణవేద సంస్కారాన్ని శుభ ముహూర్తంలో పిల్లల చెవుల్లో మంత్రాలు పఠిస్తూ చేసేవారు. చిన్నారుల చెవుల్లో మంత్రం పఠించిన అనంతరం ముందుగా బాలురకు కుడిచెవికి కుట్టి, తర్వాత ఎడమచెవికి కుట్టేవారు. అయితే అమ్మాయిల విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది.

Ear Piercing: చెవులు కుట్టడంలో మతపరమైన ప్రాముఖ్యత మీకు తెలుసా.. ఆరోగ్యానికి కూడా మేలు..
Ear Piercing Cermoney
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2024 | 10:54 AM

భారతదేశంలో ప్రాచీన కాలం నుండి చెవులు కుట్టుకునే సంప్రదాయం ఉంది. పూర్వకాలంలో అబ్బాయిలకు , అమ్మాయిలకు చెవులు కుట్టించేవారు. అయితే కాల క్రమంగా అబ్బాయిల్లో చెవులు కుట్టుకునే సంప్రదాయం తగ్గింది. అయితే నేటికీ అమ్మాయిల అలంకరణ చెవిపోగులు లేకుండా అసంపూర్ణంగా పరిగణించ బడుతుంది. చెవులకు పెట్టుకునే చెవి రింగులు స్త్రీకి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. అయితే చెవులు కుట్టుకునే సంప్రదాయం వెనుక హిందూమతపరమైన కారణాలతో పాటు.. శాస్త్రీయ కోణం కూడా ఉందని మీకు తెలుసా.. ఈ రోజున ఆ రీజన్ ఏమిటో తెలుసుకుందాం..

చెవులు కుట్టడం వెనుక మతపరమైన రీజన్

హిందూ మతంలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు 16 కర్మలు నిర్వహిస్తారు. ఈ 16 సంస్కారాల్లో  కర్ణవేద సంస్కారం కూడా ఒకటి. బాలబాలికలకు కర్ణవేధ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. పూర్వకాలంలో కర్ణవేద సంస్కారాన్ని శుభ ముహూర్తంలో పిల్లల చెవుల్లో మంత్రాలు పఠిస్తూ చేసేవారు. చిన్నారుల చెవుల్లో మంత్రం పఠించిన అనంతరం ముందుగా బాలురకు కుడిచెవికి కుట్టి, తర్వాత ఎడమచెవికి కుట్టేవారు. అయితే అమ్మాయిల విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. అంటే అమ్మాయిల ఎడమ చెవిని ముందుగా కుట్టించి ఆ తర్వాత కుడి చెవికి కుడతారు. అప్పట్లో చెవులకు ఇలా చిన్న చిల్లులు పెట్టి.. తర్వాత  బంగారు ఆభరణాలు పెట్టేవారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులు కుట్టడం వలన రాహు, కేతు గ్రహాలకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉంటాడని నమ్మకం.

చెవులు కుట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు

శాస్త్రీయ కోణంలో చెవులు కుట్టిన ప్రదేశంలో రెండు ముఖ్యమైన ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ మాస్టర్ సెన్సరీ , రెండవ పాయింట్ మాస్టర్ సెరిబ్రల్. ఇవి వినే సామర్థ్యాన్ని పెంచడానికి పనిచేస్తాయి. కనుక చెవులు కుట్టినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే ఇలా చేయడం వలన ఆందోళన తగ్గుతుంది. అనేక రకాల మానసిక వ్యాధులు కూడా నయమవుతాయని ఆక్యుప్రెషర్‌ థెరపిస్ట్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి

చెవులు కుట్టడం వల్ల మన కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్మకం. ఎందుకంటే చెవి కింది భాగంలో ఒక పాయింట్ ఉంటుంది. దానిపై ఒత్తిడి ఉన్నప్పుడు.. ఈ ఒత్తిడి ప్రభావంతో కంటి చూపు ప్రకాశవంతంగా మారుతుంది.

ఆయుర్వేదం ప్రకారం చెవి కుట్లు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో చెవి కింది భాగంలో ఒక బిందువు ఉంటుందని.. ఈ బిందువును కుట్టినప్పుడు అది మెదడుపై ప్రభావం చూపుతుందని, దీని కారణంగా మెదడులోని అనేక భాగాలు ఉత్తేజితం అవుతాయని నమ్మకం. అందుకే చిన్న వయసులోనే చెవులు కుట్టించే సంప్రదాయం మొదలై ఉంటుందని.. నేటికీ కొనసాగుతుందని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా