Holi 2024: జీవితంలో సిరిసంపదల కోసం హొలీ రోజున తులసితో ఇలా పరిహారాలు చేసి చూడండి..

ఈ రోజున హోలీ పండుగను తమ ఇళ్లలో మాత్రమే కాదు దేవాలయాలలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హొలీ రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని విశ్వాసం. ప్రతికూలత దూరం: ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఉన్నట్లు అనిపిస్తే హోలీ రోజున గంగా జలంలో తులసి ఆకులను వేసి, వాటిని పూజా స్థలంలో ఉంచండి. పూజ అనంతరం గంగాజలాన్ని ఇంట్లో మొత్తం చల్లండి. 

Holi 2024: జీవితంలో సిరిసంపదల కోసం హొలీ రోజున తులసితో ఇలా పరిహారాలు చేసి చూడండి..
Holi Tulasi Puja
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2024 | 8:53 AM

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈసారి దేశవ్యాప్తంగా హోలీ పండుగను 25 మార్చి 2024న జరుపుకోనున్నారు. ఈ రంగుల పండుగ ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున హోలీ పండుగను తమ ఇళ్లలో మాత్రమే కాదు దేవాలయాలలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హొలీ రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని విశ్వాసం.

ప్రతికూలత దూరం: ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఉన్నట్లు అనిపిస్తే హోలీ రోజున గంగా జలంలో తులసి ఆకులను వేసి, వాటిని పూజా స్థలంలో ఉంచండి. పూజ అనంతరం గంగాజలాన్ని ఇంట్లో మొత్తం చల్లండి.  ఇలా చేయడం వల్ల ఇంటి నుండి నెగెటివ్ ఎనర్జీ పోయి ఇంట్లోకి సానుకూలత వస్తుందని నమ్ముతారు.

సిరి సంపదల కోసం: సంవత్సరం పొడవునా ఇంట్లో  సిరి సంపదలు ఉండాలంటే.. పూజ ముగిసిన అనంతరం మూడు తులసి ఆకులను ఎర్రటి గుడ్డలో కట్టి దానిని మీ అల్మారాలో లేదా మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మనిషికి లోటు ఉండదని నమ్ముతారు. జీవితంలో డబ్బు, దీనితో పాటు, డబ్బుకు సంబంధించిన అడ్డంకులు కూడా తీరతాయి.

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవికి ఇష్టమైన తులసి: హోలీ రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తులసి దవళలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని, మనిషి జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

హోలీ రోజున తులసి మొక్కను నాటండి: హోలీ రోజున తులసి మొక్కను తప్పనిసరిగా నాటాలి. హిందూ విశ్వాసం ప్రకారం శ్రీ మహా విష్ణువుకు తులసి మొక్క చాలా ప్రీతికరమైనది. తులసి మొక్క ఉన్న ఇంట్లో నారాయణుడే ఉంటాడని చెబుతారు. కనుక హోలీ రోజున తులసి మొక్కను నాటడం.. దానిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల కుటుంబంలో సుఖ శాంతులు ఉంటాయని విశ్వాసం.

దేవునికి తులసి ధవళం సమర్పణ: హోలీ రోజున పూజ సమయంలో దేవునికి తులసి ఆకులను మాత్రమే సమర్పించాలి. విష్ణువు , శ్రీకృష్ణుడు తులసి ఆకులు లేని నైవేద్యాలను స్వీకరించరని నమ్మకం. అందుకే  మహావిష్ణువు అనుగ్రహం కోసం తులసి ఆకులను జోడించిన తర్వాత మాత్రమే నైవేద్యాన్ని సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు