Pomegranate Juice: ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరం దానిమ్మ.. రోజూ ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మెడిసిన్స్‌కు దూరం..

ఏ సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు ఆయా సీజన్ లో తినే ఆహారంలో చేర్చుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగమే కాదు.. ఆయా సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. అయితే కొన్ని రకాల పండ్లను మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు దొరికినా తినే ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అలాంటి పండు దానిమ్మ. దీనిని తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యమే కాదు.. లైంగిక కోరిక కూడా పెరుగుతుందట. ముఖ్యంగా దానిమ్మ పండుని జ్యూస్  గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

Surya Kala

|

Updated on: Mar 15, 2024 | 7:58 AM

శీతాకాలం ముగిసి వేసవి కాలంలో అడుగు పెట్టేశాం.. అయినప్పటికీ మార్కెట్ లో రకరకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ ఒకటి.. ఈ ఎర్రటి విత్తనాల పండుని రెగ్యులర్ గా తింటే.. మెడిసిన్స్ కు దూరంగా ఉండొచ్చు.

1 / 7
వివిధ వ్యాధులను నయం చేసేందుకు దానిమ్మ రసం బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

2 / 7

రోజూ ఒక దానిమ్మని తినగలిగితే శరీరంలోని రక్తహీనత తీరుతుంది. ఈ పండు ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

3 / 7
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా దానిమ్మ రసం నివారిస్తుంది. అందుకే ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగితే కిడ్నీలు బాగుంటాయని నిపుణులు సూచిస్తుంటారు. దానిమ్మ రసం నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడం ద్వారా దంత క్షయాన్ని నివారిస్తుంది.

4 / 7
దానిమ్మలో ఉండే ఎల్లాగిటానిన్ అనే యాంటీఆక్సిడెంట్ అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను నివారించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

5 / 7
క్రమం తప్పకుండా దానిమ్మ రసాన్ని తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దానితో పాటు ప్రేగులలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సంఖ్య కూడా పెరుగుతుంది. ఫలితంగా గ్యాస్-గుండె మంట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

6 / 7
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రతిఘటించే సామర్థ్యం దానిమ్మపండులోని కొన్ని భాగాల్లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దానిమ్మపండులో పాలీఫెనోలిక్ అనే ప్రయోజనకరమైన సమ్మేళనం ఉంటుంది. ఈ పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానిమ్మ రసం తాగితే ఛాతీ నొప్పి తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

7 / 7
Follow us