- Telugu News Photo Gallery Double Chin Problem: Do This Exercise To Reduce Double Chin, Check Details here
Double Chin: డబుల్ చిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? రోజుకు 2 సార్లు ఇలా చేయండి.. మార్పు మీరే చూస్తారు
మన చుట్టు ఉన్న చాలా మందిని గమనిస్తే.. వారిలో కొందరికి డబుల్ చిన్ ఉంటుంది. దీంతో వారు నలుగురిలోకి రావడానికి, ఫోటోలు దిగేటప్పుడు డబుల్ చిన్ (భారీ దవడ) కనిపించడ కుండా ఉండేందుకు నానాతంటాలు పడుతుంటారు. అయితే ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చంటున్నారు నిపుణులు. దాని కోసం రోజూ కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు. రోజూ ఈ ఐదు వ్యాయామాలు చేస్తే, దవడ క్రింద ఉన్న కొవ్వు కొన్ని రోజుల్లో మాయమవుతుంది..
Updated on: Mar 15, 2024 | 3:13 PM

చిన్ లిఫ్ట్.. మెడను వెనక్కి లాగి, గడ్డం పైకి ఎత్తాలి. ఇలా కనీసం పది నిమిషాలైనా చేయాలి. ఈ వ్యాయామం దవడ కొవ్వును కరిగించేలా చేస్తుంది. అలాగే గడ్డం జట్టింగ్ ఎక్సర్‌సైజ్.. దవడను ముందుకు నెట్టి, ఆపై దానిని వెనక్కి లాగి.. అలాగే కాసేపు ఉంచాలి. ఇలా చాలా సార్లు చేయాలి. ఈ వ్యాయామం దవడ కండరాలను బిగుతుగా చేస్తుంది.

నోటి కదలికలు.. ముందుగా మూతిని 'O' ఆకారంలోకి చుట్టాలి. అంటే, 'ఓ' అని చెప్పేటప్పుడు నోటి భాగాన్ని ఎలాగైతే ఉంచుతామో అలా ఉంచి.. 4-5 సెకన్లపాటు అదే భంగిమలో ఉండాలి. కాసేపు విరామం ఇచ్చి మళ్లీ ఇలాగే చేయాలి.

పెదవులు మధ్యలో పెన్సిల్ - రెండు పెదాల మధ్య పెన్సిల్ పెట్టుకోవాలి. అలా కాసేపు ఉండాలి. ఈ వ్యాయామం రోజుకు రెండుసార్లు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. మెడతో ఎక్సర్‌సైజ్.. వెళ్లకిలా పడుకుని మెడను మెల్లగా పైకి లేపాలి. ఆ తర్వాత నెమ్మదిగా క్రిందికి దించాలి. ఈ వ్యాయామం మెడ, దవడ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఒక్కరోజులో ఏదీ సాధ్యం కాదు. కాబట్టి ఈ ఐదు ఎక్సర్ సైజులు క్రమం తప్పకుండే చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వారం తర్వాత తేడాను మీరే చూస్తారు. అయితే రోజుకు రెండు సార్లు 10 నిమిషాల పాటు వీటిని చేయాలి.