ధూమపానం వదిలేయాలనుకునే వారు విటమిన్ సి ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి నికోటిన్‌ను గ్రహించి శరీరం నుంచి వ్యర్ధాలను మరింత సమర్థవంతంగా బయటకు పంపే సామర్థ్యాన్ని పెంచుతుంది. పాలు, పెరుగు, చిక్‌పీస్, చీజ్ వంటి పాల ఉత్పత్తులను కూడా ఎక్కువగా తినాలి. డైరీ ప్రొడక్ట్స్‌లో కేసైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నికోటిన్ వ్యసనాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, పాల ఉత్పత్తులు సిగరెట్ రుచిని మారుస్తాయి. ఇది ధూమపానం చేయాలనే కోరికను తగ్గిస్తుంది.