- Telugu News Photo Gallery Cinema photos Heroine Pooja Hegde focus on Bollywood Movie Offers after Guntur kaaram movie result Telugu Actress Photos
Pooja Hegde: పాపం పూజ.! ఎన్ని తిప్పలు పడ్డా అవకాశాలు ఆమడ దూరంలోనే.. ఈసారి ఇలా.!
తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా..? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు.. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు.. ఈ భామ గోల్డెన్ టైమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా..? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి.. పూజా కూడా రియాలిటీ అర్థం చేసుకుని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారా..? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో..?
Updated on: Mar 14, 2024 | 9:13 PM

తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా..? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు.. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు.. ఈ భామ గోల్డెన్ టైమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా..?

ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి.. పూజా కూడా రియాలిటీ అర్థం చేసుకుని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారా..? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో..?

పాటలో చెప్పినట్లు కెరీర్ కూడా ఎప్పుడూ అలాగే ఉంటే బాగుంటుంది కానీ అలా ఉండటానికి అది సినిమా కాదు కదా..! ఎంత పెద్ద హీరోయిన్ కెరీర్‌కైనా ఏదో ఓ టైమ్‌లో ఎక్స్‌పైరీ డేట్ తప్పదు.

తాజాగా పూజా విషయంలోనూ ఇదే జరుగుతుంది. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ఫోటోషూట్స్‌తో అలా కాలం గడిపేస్తున్నారు ఈ బ్యూటీ.

టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్‌తోనే జోడీ కట్టారు పూజా. వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్ట్స్ లిస్టులో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని ఆశగా చూస్తున్నారు..

కానీ ఇప్పటి వరకైతే అక్కడ్నుంచి కూడా ఆఫర్స్ రాలేదు. గుంటూరు కారం మిస్సయ్యాక.. పూజా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ కోయి షక్ సినిమాతో పాటు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న సంకీలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది.

అందుకే తెలుగు నుంచి ఆఫర్స్ వస్తే హ్యాపీ.. రాకపోతే ఇంకా హ్యాపీ అన్నట్లున్నారు ఈ బ్యూటీ. ఖాళీ దొరికితే ఎంచక్కా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన టాలీవుడ్‌కు పూజా బైబై చెప్పినట్లే.!




