AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda Shashti: నేడు స్కంద షష్టి.. సంతానం కోసం, సంతాన క్షేమం కోసం సుబ్రమణ్య స్వామిని ఇలా పూజించండి..

శుక్ల పక్ష షష్ఠి తిథి రోజున స్కంద షష్ఠిగా భావించి ఉపవాసం పాటిస్తారు. పంచాంగం ప్రకారం ఈ తేదీ గురువారం మార్చి 14 రాత్రి 11:26 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు మార్చి 15 రాత్రి 10:9 గంటలకు ముగుస్తుంది. కనుక స్కంద షష్ఠి ఉపవాసాన్ని పూజను ఈరోజు 15 మార్చి 2024న చేస్తారు. స్కంద షష్ఠి ప్రాముఖ్యత: పురాణాల ప్రకారం శుక్ల పక్షం షష్ఠి తిథి రోజున శివ పార్వతిల తనయుడు  కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక కార్తికేయ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజున స్కంద షష్ఠి ఉపవాసం చేస్తారు.

Skanda Shashti: నేడు స్కంద షష్టి.. సంతానం కోసం, సంతాన క్షేమం కోసం సుబ్రమణ్య స్వామిని ఇలా పూజించండి..
Skanda Shashti 2024
Surya Kala
|

Updated on: Mar 15, 2024 | 6:55 AM

Share

దక్షిణ భారతదేశంలో చాలా ముఖ్యమైనదిగా భావించే స్కంద షష్ఠి ఉపవాసం ప్రతి నెల శుక్ల పక్ష షష్ఠి తిథి నాడు ఆచరిస్తారు. స్కంద షష్ఠిని కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజు శివ పార్వతుల తనయుడు కార్తికేయను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. కార్తికేయుడిని స్కంద అనే పేరుతో పూజిస్తారు. ఈ రోజున, కార్తికేయుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ముఖ్యంగా సంతాన క్షేమం కోరి.. సంతానం కోసం సుభ్రమణ్య స్వామిని పూజిస్తారు.

స్కంద షష్టి వ్రతం: శుక్ల పక్ష షష్ఠి తిథి రోజున స్కంద షష్ఠిగా భావించి ఉపవాసం పాటిస్తారు. పంచాంగం ప్రకారం ఈ తేదీ గురువారం మార్చి 14 రాత్రి 11:26 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు మార్చి 15 రాత్రి 10:9 గంటలకు ముగుస్తుంది. కనుక స్కంద షష్ఠి ఉపవాసాన్ని పూజను ఈరోజు 15 మార్చి 2024న చేస్తారు.

స్కంద షష్ఠి ప్రాముఖ్యత: పురాణాల ప్రకారం శుక్ల పక్షం షష్ఠి తిథి రోజున శివ పార్వతిల తనయుడు  కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక కార్తికేయ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజున స్కంద షష్ఠి ఉపవాసం చేస్తారు. ఈ రోజు అంటే స్కంద షష్ఠి రోజున ఆచారాల ప్రకారం ఉపవాసం,  కార్తీక పూజ చేయడం ద్వారా సాధకుడు తన శత్రువులపై విజయం సాధిస్తాడని నమ్మకం. జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ రోజు చేసే ఉపవాసం స్త్రీలకు కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహిళలు తమ పిల్లల దీర్ఘాయువు, ఆనందం, శ్రేయస్సు , సుఖ సంపదల కోసం ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. సంతానం కలగాలనే కోరిక కోసం స్కంద షష్ఠి ఉపవాసం ఉంచడం చాలా శుభప్రదంగా,  ఫలప్రదంగా పరిగణించబడుతుంది.

స్కంద షష్టి వ్రతం పూజ విధానం: స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామున నిద్రలేచి రోజువారీ కార్యక్రమాల అనంతరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీని తరువాత స్నానం చేసి, శుభ్రమైన, ఉతికిన బట్టలు ధరించండి. దీని తరువాత స్కంద షష్ఠి నాడు ఉపవాసం కోసం సంకల్పం చేయండి. ఇప్పుడు ఇంటిలోని పూజ గదిని,  పూర్తిగా శుభ్రం చేయండి. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడితో పాటు ఆదిదంపతులైన శివుడు, తల్లి పార్వతిలను కూడా పూజించే సంప్రదాయం ఉంది.

కనుక స్కంద షష్ఠి రోజున మొత్తం శివకుటుంబాన్ని పూజించాలి. అందుకోసం శివపార్వతులతో పాటు గణపతి కార్తికేయలు కలిసి ఉన్న చిత్రపటాన్ని లేదా ప్రతిమను పూజ కోసం సిద్ధం చేసుకోండి. అనంతరం దీపం,  ధూపం వెలిగించి పూజ ప్రారంభించండి. పండ్లు, పువ్వులు, అక్షతలను సమర్పించండి. అప్పుడు నైవేద్యం సమర్పించి కార్తికేయ కథను చదవండి. కథ పూర్తయిన తర్వాత ఆరతి ఇచ్చి పూజ సమయంలో జరిగిన పొరపాట్లకు దేవునికి క్షమాపణ చెప్పండి. తర్వాత ఇంటి సభ్యులందరికీ నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని  ప్రసాదంగా పంపిణీ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు