Kanha Mahotsav: కన్హా ఆశ్రమంలో గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌.. నేడు ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ 2024 కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నేడు అధికారికంగా ప్రారంభిస్తారు. 4 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన పలువురు ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో హాజరౌతారు. దేశంలోని ఆధ్యాత్మిక గురువులతో పాటూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గురువులనందరినీ ఒక వేదికపైకి తీసుకురావాటం ఈ ఉత్సవాల ముఖ్యోద్దేశ్యం.

Kanha Mahotsav: కన్హా ఆశ్రమంలో గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌.. నేడు ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
President Murmu
Follow us

|

Updated on: Mar 15, 2024 | 6:33 AM

భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక చింతన ద్వారా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే లక్ష్యంతో కన్హా ఆశ్రమంలో గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ను నేడు రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తలు ఈ మహోత్సవ్‌కు హాజరుకానున్నారు. షాద్‌నగర్‌ సమీపంలోని కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ స్వరఝరితో ప్రారంభమైంది. ఇన్నర్‌ పీస్‌కు… సంగీతానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ప్రతిరూపంగా శంకర్ మహదేవన్ సర్వమత గీతాలతో అలరించారు. గ్లోబల్‌ స్పిరిచ్యువల్‌ మహోత్సవ్‌కు సంగీతోత్సవంతో గొప్ప ఆరంభాన్ని అందించారు. శశాంక్‌ సుబ్రహ్మణ్యం, కుమరేశ్‌ రాజగోపాలన్‌ తదితర ప్రముఖ సంగీత కళాకారుల ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. తొలిరోజు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో ధ్యానం చేశారు.

గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌ 2024 కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నేడు అధికారికంగా ప్రారంభిస్తారు. 4 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన పలువురు ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో హాజరౌతారు. దేశంలోని ఆధ్యాత్మిక గురువులతో పాటూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గురువులనందరినీ ఒక వేదికపైకి తీసుకురావాటం ఈ ఉత్సవాల ముఖ్యోద్దేశ్యం.

మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు బాటలు వేయడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని గ్రహించి విశ్వశాంతి కోసం కృషి చేసేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ, శ్రీరామచంద్రమిషన్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో కన్హా శాంతి వనంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

300 మందికి పైగా ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో లక్షమందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా. వసుధైవ కుటుంబంకం సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం ఈ కార్యక్రమం లక్ష్యాల్లో ఒకటి. మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్విక ఆలోచనల ద్వారా విశ్వ శాంతికి మార్గదర్శనం చేయటమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..