AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra: నాగుపాము పట్ల మనిషి కూరత్వం.. కోరలు పీకి, విషాన్ని తీసి.. నోటిని ఫెవిక్విక్‌తో అతికించిన మహిళ

బేతుల్ జిల్లా పరిధిలోని భైందేహిలో పాములను ఆడించే ఒక మహిళ సుమారు 5 అడుగుల పొడవు గల నాగుపాముతో సంచరిస్తున్నట్లు పాము నిపుణుడికి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పాముల నిపుణుడు శివ నర్వారే  ఆ మహిళ వద్దకు చేరుకుని.. ప్రశ్నించడంతో ఆ మహిళ అక్కడ నుంచి  పరారయ్యింది. ఈ సందడిలో నాగు పాముని అక్కడే వదిలి వేసింది. అప్పుడు నాగుపాము పరిస్థితి బాగాలేదు. పాము తీవ్రంగా గాయపడింది. పాము నోరు కూడా అతుక్కుని ఉంది. దీంతో పాము నోరు తెరవలేకపోయింది. 

King Cobra: నాగుపాము పట్ల మనిషి కూరత్వం.. కోరలు పీకి, విషాన్ని తీసి.. నోటిని ఫెవిక్విక్‌తో అతికించిన మహిళ
King Cobra
Surya Kala
|

Updated on: Mar 15, 2024 | 10:05 AM

Share

మనుషులు పాము కనబడితే ఎలా పరిగెత్తి పారిపోతారో.. అదేవిధంగా మనుషులను చూసిన పాములు కూడా భయపడి పారిపోతాయట.. ఎందుకంటే పాములను పట్టుకుంటే మనుషులు వాటిని దారుణంగా హింసించి డబ్బులను సంపాదిస్తారు. పాముని బుట్టలో పెట్టుకుని తిరుగుతూ అడుక్కోవడం సర్వసాధారణం అయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఈ పాములను బుట్టలో పెట్టుకుని తిరుగుతూ వాటి ద్వారా డబ్బు సంపాదించడం కనిపిస్తుంది. ఇలా చేయడం కోసం పాములను నానా హింస పెడుతున్నారు. తాజాగా  మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో పాము పాముకు సంబంధించిన ఇలాంటి కేసు ఒక  వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పాముని పట్టుకుని ఆడిస్తున్న ఒక మహిళ తన స్వలాభం కోసం ఫెవిక్విక్‌తో నాగుపాము నోటిని అంటించింది.

వాస్తవానికి బేతుల్ జిల్లా పరిధిలోని భైందేహిలో పాములను ఆడించే ఒక మహిళ సుమారు 5 అడుగుల పొడవు గల నాగుపాముతో సంచరిస్తున్నట్లు పాము నిపుణుడికి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పాముల నిపుణుడు శివ నర్వారే  ఆ మహిళ వద్దకు చేరుకుని.. ప్రశ్నించడంతో ఆ మహిళ అక్కడ నుంచి  పరారయ్యింది. ఈ సందడిలో నాగు పాముని అక్కడే వదిలి వేసింది. అప్పుడు నాగుపాము పరిస్థితి బాగాలేదు. పాము తీవ్రంగా గాయపడింది. పాము నోరు కూడా అతుక్కుని ఉంది. దీంతో పాము నోరు తెరవలేకపోయింది.

నాగ పాముకి చికిత్స

పాము నిపుణుడు శివ్ నర్వారే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాగుపామును వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ జ్యోతి తోప్పో ముందుగా నాగుపామును క్షుణ్ణంగా పరిశీలించి చికిత్స అందించారు. పరీక్షలో కోబ్రా పాము నోటిని ఫెవిక్విక్‌తో అతికించినట్లు తేలింది.

ఇవి కూడా చదవండి
King Cobra 2

King Cobra 2

చికిత్స సమయంలో నాగుపాము కోరలు కూడా తీసినట్లు.. విషాన్ని కూడా పిండినట్లు గుర్తించారు. పాము నోటిలో గాయం ఏర్పడింది. గాయం నుంచి చీము కారడం మొదలు పెట్టినట్లు గుర్తించారు. దీంతో పాముకి పూర్తి చికిత్స చేసి నాగ పామును సురక్షితంగా అడవిలోకి వదిలారు. ఈ మొత్తం సంఘటన గురించి సమాచారం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు అందించబడింది. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు పాముని ఆడిస్తున్న మహిళ  కోసం వెతుకుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..