పర్ఫెక్ట్‌ బిజినెస్‌ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్‌ ఇదేనట..! డైట్‌లో ఈ జ్యూస్‌ తప్పనిసరి

ఇది తన ఆరోగ్యం కోసమే కాకుండా.. స్కిన్​ కేర్​ను రక్షించడంలోనూ మేలు చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు నో చెబుతూ, నీతా పుష్కలంగా నీరు తాగుతారు. తన ఆహారంలో ఆకు కూరలు, పండ్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు.. రాత్రిపూట క్రమం తప్పకుండా వెజిటేబుల్‌ సూప్ తీసుకుంటారు. నీతా ప్రతిరోజూ వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేస్తారు. నీతాకి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇవన్నీ నీతా అంబానీ ఫిట్‌నెస్‌కి కారణం. 

పర్ఫెక్ట్‌ బిజినెస్‌ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్‌ ఇదేనట..! డైట్‌లో ఈ జ్యూస్‌ తప్పనిసరి
Nita Ambani
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 15, 2024 | 7:51 AM

నీతా అంబానీ .. ఆసియా బిలియనీర్‌, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య మాత్రమే కాదు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ వర్క్ వంటి అనేక రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా ఆమె తన స్టైల్‌, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తారు. యాభై ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా నడుస్తున్న నీతా డ్యాన్స్‌కి, ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. 55 ఏళ్ల వయస్సులో నీతా అంబానీ చాలా మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె పనితనం వల్లనే కాదు, ఆమె శైలి, అందం కూడా అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నీతా బ్యూటీ సీక్రెట్ వెనుక రెగ్యులర్ డైట్ ఉంది. నీతా ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో నట్స్, పండ్లు, తాజాగా కూరగాయలు వంటివి మాత్రమే తీసుకుంటారు..

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..బీట్‌రూట్ జ్యూస్‌. నీతా అంబానీ తన డైట్‌లో తప్పనిసరిగా ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్‌ తీసుకుంటారు. తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే బీట్‌రూట్ జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి రక్తహీనతను నివారిస్తాయి. బరువు తగ్గాలన్నా.. హెల్తీగా ఉండాలన్నా.. శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా అవసరం. అందుకే నీతా రోజూ నిమ్మరసం, పుదీనా కలిపిన డిటాక్స్ డ్రింక్​ను తీసుకుంటారు. ఇది ఆమె చర్మ సంరక్షణకు కూడా తోడ్పడుతుంది.

పూర్తి ఆరోగ్య కరమైన బ్రేక్​ఫాస్ట్‌తో రోజును ప్రారంభిస్తారు నీతా అంబానీ. అల్పాహారంలో తాజా పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్​తీసుకుంటారు. కేలరీలు తక్కువ ఉండేలా చూసుకుంటారు. ఇది తన ఆరోగ్యం కోసమే కాకుండా.. స్కిన్​ కేర్​ను రక్షించడంలోనూ మేలు చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు నో చెబుతూ, నీతా పుష్కలంగా నీరు తాగుతారు. తన ఆహారంలో ఆకు కూరలు, పండ్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు.. రాత్రిపూట క్రమం తప్పకుండా వెజిటేబుల్‌ సూప్ తీసుకుంటారు. నీతా ప్రతిరోజూ వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేస్తారు. నీతాకి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇవన్నీ నీతా అంబానీ ఫిట్‌నెస్‌కి కారణం.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..