Watch Video: వీధుల్లో డబ్బుల వర్షం.. సూట్‌కేలలో నింపుకుంటున్న జనాలు.. ఎక్కడంటే..

నేటి కాలంలో నడి రోడ్డుపై డబ్బులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, జనాలు ఆ డబ్బును సూట్‌కేసుల్లో నింపుకుని తీసుకెళ్తున్నారని ఎవరైనా చెబితే నమ్మడం కష్టంగానే ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో రోడ్డుపై ఎటు చూసినా నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ నోట్లను సూట్‌కేస్‌లో నింపడంలో బిజీగా ఉన్నారు. ఇంత డబ్బు వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే

Watch Video: వీధుల్లో డబ్బుల వర్షం.. సూట్‌కేలలో నింపుకుంటున్న జనాలు.. ఎక్కడంటే..
Money On The Road
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 14, 2024 | 1:16 PM

నేటి కాలంలో కష్టపడకుండా ఒక్క పైసా కూడా రావడం లేదు. ఒక సామాన్యుడు కోటీశ్వరుగా ఎదగాలంటే ఎన్నో సంవత్సరాలపాటు కష్టపాడాల్సి ఉంటుంది. మంచి, సౌకర్యవంతమైన జీవితం గడపడానికి డబ్బు అవశ్యకత అతి ముఖ్యమైనది. ఇకపోతే, సోషల్ మీడియా పుణ్యమా అని అనేక రకాల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాంటి వీడియోలు చూసి నెటిజన్లు పగలబడి నవ్వుతుంటారు. కొన్నిసార్లు ఆశ్చర్యపోతారు. ఇలాంటి వీడియోలను మనం చాలాసార్లు చూస్తుంటాం. ఇక్కడ కూడా అలాంటిదే ఒక వీడియో హల్‌చల్‌ చేస్తోంది. నడి రోడ్డుపై నోట్లు కుప్పలు తెప్పలుగా పడివున్నాయి. ప్రజలు ఆ డబ్బును సూట్‌కేస్‌లలో నింపుకుంటున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేటి కాలంలో నడి రోడ్డుపై డబ్బులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, జనాలు ఆ డబ్బును సూట్‌కేసుల్లో నింపుకుని తీసుకెళ్తున్నారని ఎవరైనా చెబితే నమ్మడం కష్టంగానే ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో రోడ్డుపై ఎటు చూసినా నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ నోట్లను సూట్‌కేస్‌లో నింపడంలో బిజీగా ఉన్నారు. ఇంత డబ్బు వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే అని ఈ వీడియో చూసిన తర్వాత అందరి మనసులో మెదులుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ నోట్లు మధ్యప్రాచ్యంలోని ఏదో ఒక దేశానికి చెందినవని తెలుస్తోంది. ఇది అక్కడి స్థానిక కరెన్సీ అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను MR.goodluck అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసారు. దీనిని ఇప్పటివరకు 98 మిలియన్ల మంది వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వీడియో చూసిన తర్వాత రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు. నేను ఇందులో మీకు సహాయం చేయగలనా? ఇంత డబ్బు వస్తే ఆ ప్రాంతమంతా బాగుపడుతుందని మరొకరు రాశారు.

అయితే, ఈ నోట్లన్నీ నిజమైనవా లేదా నకిలీవా అనే దానిపై ఎటువంటి ధృవీకరణ లేదు. వాటికి ఎటువంటి ప్రామాణికత లేదు. ఈ వినియోగదారు తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి నమ్మశక్యం కానీ, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ నోట్లు అసలైనవే అయితే సామాన్యుడికి కలగానే మిగిలిపోతుందని నెటిజన్లు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..