Money Found On Road: రోడ్డు మీద డబ్బు దొరికిందా..? అది మీ అదృష్టాన్ని మార్చేయవచ్చు..! ఈ విషయాలు తెలుసుకోండి..

చాలామందికి రోడ్డుపై వెళ్తుంటే డబ్బు దొరకటం సహజంగా జరుగుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా డబ్బులు దొరికితే అదృష్టవంతులు అవుతారు అని అంటారు. కానీ రోడ్డు మీద దొరికిన డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేరు. అలాగే, నాణేలు, నోట్లను ఖర్చు చేయకూడదని భావిస్తారు. అలాంటప్పుడు దారిలో దొరికిన డబ్బును ఏం చేయాలి..?

Money Found On Road: రోడ్డు మీద డబ్బు దొరికిందా..? అది మీ అదృష్టాన్ని మార్చేయవచ్చు..! ఈ విషయాలు తెలుసుకోండి..
Money Found On Road
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 14, 2024 | 9:35 AM

కొన్ని కొన్ని సార్లు మనం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే చిల్లర నాణేలు, నోట్లు దొరకటం సహాజం. అలా రోడ్డుపై డబ్బు దొరకడం అదృష్టానికి సంకేతమని కొందరు అంటారు. లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతంగా మరికొందరు నమ్ముతారు. కానీ కొన్నిసార్లు మూడు రోడ్లు కలిసే చోట మంత్రాలు, క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అక్కడ కూడా చిల్లర నాణేలు, నోట్లు కూడా పెడుతుంటారు. వీటిని తీసుకోవడం ప్రమాదకరమని భయపడుతుంటారు. మంత్రాలు చేసి వేసిన నాణేలను తీసుకుంటే లేనిపోని కష్టాలు, దరిద్రాలు వెంటాడుతాయని భావిస్తారు. మీకు కూడా రోడ్డుపై వెళ్తుంటే నాణేలు దొరికాయనుకోండి.. అప్పుడు ఏం చేయాలో తెలుసా..? ఇది శుభమా, అశుభమా అనే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

చాలామందికి రోడ్డుపై వెళ్తుంటే డబ్బు దొరకటం సహజంగా జరుగుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా డబ్బులు దొరికితే అదృష్టవంతులు అవుతారు అని అంటారు. కానీ రోడ్డు మీద దొరికిన డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేరు. అలాగే, నాణేలు, నోట్లను ఖర్చు చేయకూడదని భావిస్తారు. అలాంటప్పుడు దారిలో దొరికిన డబ్బును ఏం చేయాలి..? వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణుల సమాచారం ప్రకారం.. రోడ్డు మీద దొరికిన నాణేన్ని ఇంటికి తెచ్చి పసుపు నీళ్లతో బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత పూజా గదిలో ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి, దానిపై ఈ నాణెం ఉంచండి. తర్వాత దానిపై పసుపు-కుంకుమ వేయాలి. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. ఈ విధంగా రోడ్డు మీద డబ్బు దొరకడం మీ అదృష్టానికి సూచన లాంటిదని చెబుతున్నారు. దాంతో మీరు మరింత డబ్బు సంపాదిస్తారని ఇది సూచిస్తుంది.

కానీ, కొందరు నిమ్మకాయలు, పసుపు-కుంకుమ తదితర వస్తువులతో పాటు నాణేలు, నోట్లు మంత్రాలు చేసి, క్షుద్రపూజలకు ఉపయోగిస్తారు..అలాంటప్పుడు మీరు వాటిని ఇంటికి తీసుకురాకూడదు. కానీ దారిలో మీకు నాణెం దొరికితే మాత్రం, మీరు దానిని ఇంటికి తీసుకురావొచ్చు. ఇలా తెచ్చిన నాణేన్ని ప్రతి శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజించాలి. అలాగే, కొందరికి నాణెం కాకుండా నోటు దొరికితే, అది కూడా శుభసూచికే అంటున్నారు. ఇది మీ ఇంటికి లక్ష్మీ దేవి రాకను సూచిస్తుందని చెబుతారు. అందుకని అలా రోడ్డుపై దొరికిన నోట్‌ను ఇంటికి తెచ్చి దాని మీద కొంచెం నీళ్లు చల్లి దేవుడి గదిలో పెట్టి పూజ చేయాలి. ఇది కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!