Ujjaini: ఏడాదికి ఒక్కసారే ఏకకాలంలో ఐదు రూపాల్లో మహాకాళుని దర్శనం.. భారీగా దర్శించుకున్న భక్తులు
మహా శివరాత్రి తర్వాత ఫాల్గుణ మాసములో శుక్ల పక్షము పాడ్యమి తిథి రోజు చంద్రుని దర్శనం జరిగే సమయంలో పంచ ముఖవింద దర్శనం లభిస్తుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అద్భుతమైన భగవంతుని దర్శనం పొందుతారు. సాంప్రదాయం ప్రకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం, శివ నవరాత్రి ఉత్సవాలు ఫాల్గుణ కృష్ణ పంచమి నుంచి ఫాల్గుణ కృష్ణ త్రయోదశి మహా శివరాత్రి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో బాబా మహాకాళేశ్వరుడిని ప్రతిరోజూ అనేక రూపాల్లో అలంకరిస్తారు. అయితే శివ నవరాత్రుల చివరి రోజున ఫాల్గుణ శుక్ల పక్షం పాడ్యమి తిధిలో మహాకాళేశ్వరుడి తన భక్తులకు ఒకటి లేదా రెండు కాదు మొత్తం ఐదు రూపాల్లో దర్శనమిస్తాడు. ఈ ఐదు రూపాలను దర్శిస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయంలో మహాకాళుడు తన ఐదు రూపాలతో తన భక్తులకు ఏకకాలంలో దర్శనం ఇచ్చాడు. భగవంతుని ఐదు రూపాల దర్శనాన్ని పంచ ముఖవింద దర్శనం అంటారు.
సమాచారం కోసం మహా శివరాత్రి తర్వాత ఫాల్గుణ మాసములో శుక్ల పక్షము పాడ్యమి తిథి రోజు చంద్రుని దర్శనం జరిగే సమయంలో పంచ ముఖవింద దర్శనం లభిస్తుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అద్భుతమైన భగవంతుని దర్శనం పొందుతారు.
సాంప్రదాయం ప్రకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం, శివ నవరాత్రి ఉత్సవాలు ఫాల్గుణ కృష్ణ పంచమి నుంచి ఫాల్గుణ కృష్ణ త్రయోదశి మహా శివరాత్రి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ రోజుల్లో పూజారులు ప్రతిరోజూ మహాకాళ స్వామిని అలంకరిస్తారు.
శివుడిని పంచనన్ అని పిలుస్తారు. శివుడు ఐదు రూపాల్లో ప్రపంచాన్ని కాచి కాపాడుతాడు. అందుకే ఫాల్గుణ శుక్ల పక్షంలోని పాడ్యమి రోజున బాబా మహాకాళేశ్వరుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చంద్ర దర్శనం రోజున ఐదు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
మహాకాళేశ్వర ఆలయ మహాశివరాత్రి ఎందుకు ప్రత్యేకం?
శివ నవరాత్రులలో మహాకాళేశ్వరుడిని దర్శనం చేసుకోలేని భక్తులు ఐదు ముఖారవిందాలను కలిపి చూస్తే, మొత్తం శివ నవరాత్రుల పుణ్యఫలాలను పొందుతారని నమ్మకం. అందుకే బాబా మహాకాలేశ్వరుడి ఐదు ముఖాలను చూడటానికి… ఈ దర్శనంతో తమ కోరికలను తీర్చుకోవడానికి.. పుణ్యం సంపాదించుకోవడానికి భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు.
సాయంత్రం హారతి పంచముఖ దర్శనం
చంద్రుడిని శివుడు తన శిరస్సుపై ధరించిన పవిత్రమైన రోజు ఫాల్గుణ మాసములో శుక్ల పక్షము పాడ్యమి తిథి అని నమ్మకం. ఈ రోజున స్వామివారిని ఏకకాలంలో ఐదు రూపాల్లో అలంకరిస్తారు. అనంతరం శయన హారతి వరకు పంచముఖారవిందాలను భక్తులు దర్శించుకున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు