- Telugu News Photo Gallery Summer Health Tips: Five Healthy Foods To Eat In This Summer Season, Check The List
Summer Food: రోజు రోజుకీ పెరుగుతున్న వేడి.. వేసవి ఉపశమనం కోసం తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..
వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకీ వేడి పెరుగుతోంది. దీంతో వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. కనుక రోజూ తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. అంతేకాదు వేసవి లో కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని మీకు తెలుసా?
Updated on: Mar 14, 2024 | 7:44 AM

శీతాకాలం ముగిసింది.. దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతేకాదు ఈ వేసవిలో గత ఏడాది కంటే విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం శరీరం వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ముందుగా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. అంతేకాదు శరీరానికి వేసవి కాలంలో ఉపశనాన్ని కూడా కూరగాయలు ఇస్తాయి. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఎండా కాలంలో చాలా మంది కడుపు సమస్యలతో బాధపడుతుంటారు. మజ్జిగను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. పెరుగు, నల్ల ఉప్పు కలిపి దాహార్తిని తీర్చే మజ్జిగను తయారు చేసుకుని తరచుగా తాగాల్సి ఉంది.

ప్రతిరోజూ నిమ్మరసం తాగండి. నిమ్మకాయలో విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువ. ఇది వేడి నుండి రక్షించడమే కాదు. బదులుగా ఇది శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. ఫలితంగా మీరు రోజుకు కొన్ని గ్లాసుల నిమ్మరసం త్రాగవచ్చు.

వేసవిలో ఎలాంటి శరీర రుగ్మతలు రాకుండా ఉండాలంటే పుల్లటి పెరుగు తినండి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అవసరమైతే లస్సీని తయారు చేసుకుని రోజుకు ఒకసారి తినండి. అయితే లస్సిలో చక్కెర బదులుగా బ్రౌన్ షుగర్ ని ఉపయోగించండి.

వడ దెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి. ఇవి శరీరాన్ని వేడిగా మార్చగలవు. అవసరమైతే కుండలోని చల్లని నీటిని తాగండి. లేదా కొబ్బరి నీరు తాగండి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

కీర దోసకాయను తినండి. కీర దోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక రోజుకు కనీసం ఒక కీర తినండి. కీర తినడం ఇష్టం లేకపోతే తర్వాత పెరుగులో కలుపుకుని తినవచ్చు. ఇలా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.




