- Telugu News Photo Gallery Melanoma Cancer: What Are The 5 Warning Signs Of Melanoma Cancer, Know Details Here
Melanoma Cancer: బ్యూటీ స్పాట్స్ అనుకుంటే పొరబాటే.. ప్రాణాలను హరించే భయంకరమైన క్యాన్సర్ సంకేతాలు!
సాధారణంగా శరీరంలోని వివిధ ప్రదేశాల్లో మొటిమలు వస్తుంటాయి. అవి రోజురోజుకు పెరుగిపోతుంటాయి. అయితే ఇవి ఎందుకు అలా ఏర్పడతాయో చాలామందికి అవగాహన ఉండదు. కానీ ఇవి కామన్ అని లైట్ తీసుకుంటే మాత్రం పెను ప్రమాదంలో పడ్డట్లే. తాజా అధ్యయనం ప్రకారం మొటిమ లేదా పుట్టుమచ్చ పరిమాణం, రూపాన్ని మార్చినట్లయితే అది క్యాన్సర్ కావచ్చు..
Updated on: Mar 13, 2024 | 9:18 PM

సాధారణంగా శరీరంలోని వివిధ ప్రదేశాల్లో మొటిమలు వస్తుంటాయి. అవి రోజురోజుకు పెరుగిపోతుంటాయి. అయితే ఇవి ఎందుకు అలా ఏర్పడతాయో చాలామందికి అవగాహన ఉండదు. కానీ ఇవి కామన్ అని లైట్ తీసుకుంటే మాత్రం పెను ప్రమాదంలో పడ్డట్లే. తాజా అధ్యయనం ప్రకారం మొటిమ లేదా పుట్టుమచ్చ పరిమాణం, రూపాన్ని మార్చినట్లయితే అది క్యాన్సర్ కావచ్చు.

కాబట్టి ఇకపై అకస్మాత్తుగా మీ శరీరంపై మొటిమలు లేదా పుట్టుమచ్చలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. చర్మ క్యాన్సర్ వచ్చినప్పుడు మొటిమల రంగు మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే మెలనోమా క్యాన్సర్ అంటారు. అధ్యయనాల ప్రకారం ప్రారంభ దశలో ఈ మార్పుపై దృష్టి పెట్టినట్లైతే చర్మ క్యాన్సర్‌కు పూర్తి చికిత్స సాధ్యమవుతుంది.

మెలనోమా క్యాన్సర్ ఎక్కువ సూర్యరశ్మికి గురైన శరీర భాగాలలో మొదలవుతుంది. అందువల్ల, శరీరంలోని ఈ భాగాలలో ఉన్న పుట్టుమచ్చలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మెలనోమా క్యాన్సర్ మొటిమల లక్షణాలు ఎలా ఉంటాయంటే.. శరీరంలో మొటిమ పరిమాణం, ఆకృతిలో మారడాన్నే మెలనోమా క్యాన్సర్ అంటారు.

శరీరంపై మొటిమలు రంగు మారడం ప్రారంభించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మెలనోమా క్యాన్సర్ బారీన పడినట్లైతే శరీరంపై పుట్టుమచ్చలు లేదా మొటిమలు ఎర్రగా మారతాయి.

ఆ తర్వాత కొంతకాలానికి మొటిమ దురద పెట్టి, రక్తస్రావం ప్రారంభమవుతుంది. క్యాన్సర్ ఉంటే.. మొటిమల్లో దురద, కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది.




