Trigrahi Yoga: కుంభ రాశిలో ఏర్పడనున్న త్రిగ్రాహి యోగ.. ఈ మూడు రాశులు పట్టిందల్లా బంగారమే..

నవ గ్రహాల్లో కర్మ ప్రదాత శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించగా.. త్వరలో కుంభ రాశిలోకి అంగారకుడు కూడా అడుగు పెట్టనున్నాడు. అంటే కుంభ రాశిలో శనీశ్వరుడు, కుజుడు, శుక్రుడు కలయిక జరగనుంది. దీంతో అరుదైన త్రిగ్రహి యోగ ఏర్పడనుందని .. కొన్ని రాశులకు అదృష్టాన్ని ఈ యోగ తెస్తుందని జ్యోతిష్యులు చెప్పారు. ఈ రోజు అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

Trigrahi Yoga: కుంభ రాశిలో ఏర్పడనున్న త్రిగ్రాహి యోగ.. ఈ మూడు రాశులు పట్టిందల్లా బంగారమే..
Trigrahi Yog In Kumbh Rashi
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2024 | 10:29 AM

జాతకంలో నవ గ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ గ్రహాలు ఒకొక్క రాశిలో సంచరిస్తూ నిర్దిష్ట సమయంలో తమ రాశులను మార్చుకుంటాయి. అయితే నవగ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా కదిలే గ్రహం.. కాగా ఈ నెలలో మూడు గ్రహాలు ఒక రాశిలో కలవనున్నాయి. నవ గ్రహాల్లో కర్మ ప్రదాత శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించగా.. త్వరలో కుంభ రాశిలోకి అంగారకుడు కూడా అడుగు పెట్టనున్నాడు. అంటే కుంభ రాశిలో శనీశ్వరుడు, కుజుడు, శుక్రుడు కలయిక జరగనుంది. దీంతో అరుదైన త్రిగ్రాహి యోగ ఏర్పడనుందని .. కొన్ని రాశులకు అదృష్టాన్ని ఈ యోగ తెస్తుందని జ్యోతిష్యులు చెప్పారు. ఈ రోజు అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మకర రాశి: ఈ రాశికి చెందిన వారికి త్రిగ్రాహి యోగం అదృష్టాన్ని తెస్తుంది. ఆర్ధిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలను ఇస్తుంది. మకర రాశికి చెందిన వ్యక్తుల కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పటి నుంచో ఆగిన పనులు మళ్ళీ మొదలు పెడతారు. పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ ను అందుకుంటారు. సమస్యలు దూరం అయి.. సంతోషంగా గడుపుతారు.

మేష రాశి: శని, కుజ, శుక్రుడు కలయికతో ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్ధికంగా లాభాలు తెస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో మంచి స్టేజ్రు కు చేరుకుంటారు. పూర్వీకుల స్థిర చరాస్తులు దక్కే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. పెట్టే పెట్టుబడులు లాభాలను తెస్తాయి.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి:  శని , కుజుడు, శుక్రుడు గ్రహాల సంయోగం కారణంగా ఈ రాశికి చెందిన వారికి లక్కే లక్కు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. భార్య భర్తల మధ్య వివాదాలు తగ్గి.. సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు శుభవార్త వినే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు