Horoscope Today: ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (మార్చి 15, 2024): మేష రాశి వారికి శుక్రవారంనాడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 15, 2024): మేష రాశి వారికి శుక్రవారంనాడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు మిత్రులను ఆదుకోవడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో అధికారాలను పంచుకోవడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు సత్ఫ లితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. జీవిత భాగస్వామితో సంప్రదించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే సూచనలున్నాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శించడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతాయి. పిల్లల చదువుల్లో శ్రద్ధ తీసుకుంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అవుతాయి. సమయం చాలా వరకు, చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలను, విమర్శలను పట్టించు కోవద్దు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్ప డుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సానుకూ లపడతాయి. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అధికారులకు బాగా ఉపయోగపడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. సహచరులతో బాధ్యతలు పంచుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. సంపాదనలో కొద్ది భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులకు, సహచరులకు అండగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఇంట్లో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. మీ మనసులోని ప్రధానమైన కోరిక ఒకటి నెరవేరుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. కుటుంబ వ్యవహారాలు చాలావరకు సానుకూలపడతాయి. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆదాయానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా, ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణ భారం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ముఖ్య వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు మంచి కంపెనీల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. దూరపు బంధువుల నుంచి ఒక శుభవార్త అందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబపరంగా కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆనందంగా సాగిపోతాయి. వ్యాపారాలలో అంచనాలకు చేరుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అయితే, సహోద్యోగులు చేదోడు వాదోడుగా ఉంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి పురో గతి సాధిస్తారు. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయ త్నాలలో అవాంతరాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి.