AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukshma Buddhi Yoga: మీన రాశిలోకి రవి గ్రహ ప్రవేశం.. ఆ రాశుల వారికి శుభ ఫలితాలు, జీవితంలో కొత్త మలుపులు..!

ఈ నెల 15న రవి గ్రహం  తన శత్రు క్షేత్రమైన కుంభ రాశి నుంచి మిత్ర క్షేత్రమైన మీన రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. రవి మీన రాశిలో ఏప్రిల్ 16 వరకూ సంచరిస్తాడు. ప్రస్తుతం మీన రాశిలోనే ఉన్న బుధ గ్రహంతో రవి ఈ నెల 15 నుంచి కలసి ఉండబోతున్నందువల్ల ఇక్కడ బుధాదిత్య యోగమనే ‘సూక్ష్మ బుద్ధి’ యోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

Sukshma Buddhi Yoga: మీన రాశిలోకి రవి గ్రహ ప్రవేశం.. ఆ రాశుల వారికి శుభ ఫలితాలు, జీవితంలో కొత్త మలుపులు..!
Astrology 2024
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 14, 2024 | 10:57 PM

Share

ఈ నెల 15న రవి గ్రహం  తన శత్రు క్షేత్రమైన కుంభ రాశి నుంచి మిత్ర క్షేత్రమైన మీన రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. రవి మీన రాశిలో ఏప్రిల్ 16 వరకూ సంచరిస్తాడు. ప్రస్తుతం మీన రాశిలోనే ఉన్న బుధ గ్రహంతో రవి ఈ నెల 15 నుంచి కలసి ఉండబోతున్నందువల్ల ఇక్కడ బుధాదిత్య యోగమనే ‘సూక్ష్మ బుద్ధి’ యోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. ఆదాయం, అధికారం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, సమస్యలకు సంబంధించి ఎక్కువగా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యోగం వల్ల లబ్ధి పొందే రాశులుః వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, కుంభం.

  1. వృషభం: ఈ రాశికి లాభస్థానంలో అంటే 11వ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల ఈ రాశివారి ఆదాయ  ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో హోదాపరంగానే కాక, ఆదాయపరంగా, లాభాల పరంగా కూడా అతి వేగంగా పురోగతి ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. నిరు ద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఆఫర్ వస్తుంది. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  2. మిథునం: ఈ రాశివారికి పదవ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభా పాబవాలకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. అదికార యోగం పడుతుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు ఉపకరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. జీవితాన్ని మంచి మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ యానానికే కాక, విదేశీ సొమ్ము అనుభవించడానికి కూడా అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి సంపద లేదా ఆర్థిక లాభం కలుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం ఒక విశేషం. అన్ని విధాలా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఈ రాశివారి సలహాలు, సూచనలు అధికారు లకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీరి ప్రతిభా పాటవాలు బాగా వికసిస్తాయి. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. వ్యాపా రాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం పట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాధాన్యం  పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తులు కలిసి వస్తాయి. మాతృమూలక ధన లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ సత్కారాలు లభిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది.
  6. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల సర్వత్రా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయానికి, రాబడికి లోటుండదు. కుటుం బంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజ యం సాధించడం జరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఇతరుల వివాదాలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.