Marriage Astrology: కుంభ రాశిలోకి కుజుడు సంచారంతో ఆ రాశుల వారికి పెళ్లి యోగాలు..! అందులో మీ రాశి ఉందా..
ఈ నెల 16న కుజుడు కుంభ రాశి ప్రవేశంతో ఆ రాశిలో ఇప్పటికే కలిసి ఉన్న శని, శుక్రులతో యుతి చెందినట్టవుతుంది. దీనివల్ల ప్రేమ, వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ప్రేమల్లో పడడం, ప్రేమలు పెళ్లిళ్లకు దారితీయడం, పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం, వైవాహిక జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
ఈ నెల 16న కుజుడు కుంభ రాశి ప్రవేశంతో ఆ రాశిలో ఇప్పటికే కలిసి ఉన్న శని, శుక్రులతో యుతి చెందినట్టవుతుంది. దీనివల్ల ప్రేమ, వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ప్రేమల్లో పడడం, ప్రేమలు పెళ్లిళ్లకు దారితీయడం, పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం, వైవాహిక జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ శుక్రుడు ఈ రాశిలో ఈ నెలాఖరు వరకు కొనసాగుతున్నందువల్ల ఈ శుభ పరిణామాలు నెలాఖరు లోపల చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఈ గ్రహాల కలయిక వల్ల శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి కుజుడు ప్రవేశించి, ఇప్పటికే అక్కడ సంచారం చేస్తున్న శని, శుక్రులతో కలవడం వల్ల సంపన్న కుటుంబంలో లేదా పలుకుబడి కలిగిన కుటుంబంలో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమై, దంపతుల మధ్య సఖ్యత, సయోధ్య పెరుగుతాయి. కుటుంబపరంగా కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ మూడు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల, విదేశాల్లో స్థిరపడిన జంటలకు యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి విదేశీ సంబంధం ఖాయమయ్యే సూచనలున్నాయి. ఇప్పుడు ప్రేమ జీవితంలో ప్రవేశించినవారికి తప్పకుండా ప్రేమ సఫలం అవుతుంది. ఇప్పటికే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు త్వరలో దంపతులయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
- సింహం: ఈ రాశికి సప్తమంలో కుజ, శని, శుక్రుల కలయిక జరుగుతున్నందువల్ల అంచనాలకు మించిన మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. సాధారణంగా ఇష్టపడ్డ వారితో లేదా మొదటి పెళ్లి చూపుల్లోనే సంబంధం ఖాయమవడం జరుగుతుంది. ప్రేమలో పడినా, పెళ్లి సంబంధం కుదిరినా ఈ రాశివారి జీవితం ఆ తర్వాత సుఖమయం అవుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే సూచ నలున్నాయి. ప్రేమించిన వ్యక్తితో గానీ, జీవిత భాగస్వామితో గానీ విహార యాత్రకు అవకాశ ముంది.
- తుల: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ మూడు గ్రహాల యుతి వల్ల తప్పకుండా తనకు అనుకూలమైన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రేమల్లో ఉన్నవారికి ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. దాంపత్య జీవితంలో సఖ్యత, సామరస్యం వెల్లి విరుస్తాయి. జాతక చక్రంలోని గ్రహాలను బట్టి, ఈ రాశివారిలో కొందరు ఇతరులతో శృంగార కార్యకలాపాలు సాగించే అవకాశం కూడా ఉంది. ప్రేమికులు లేదా దంపతులు విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కుజ, శుక్ర, శనుల యుతి వల్ల ఈ రాశివారికి అటు ప్రేమ జీవి తంలోనూ, ఇటు వైవాహిక జీవితంలోనూ సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారితో పాటు దాంపత్య జీవితంలో ఉన్నవారికి కూడా ఐశ్వర్య యోగం లేదా మహాభాగ్య యోగం పడుతుంది. తల్లి వైపు బంధువులతో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుటుంబాధిపతి శనీశ్వరుడితో కుజ, శుక్రులు యుతి చెందడం వల్ల దాంపత్య జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి, అన్యోన్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇష్టపడిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశముంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోవ డమే కాక, తప్పకుండా పెళ్లికి దారితీసే అవకాశముంది. కుటుంబపరంగా ధన ధాన్య వృద్ధి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం ఖాయ మవుతుంది.