కుంభరాశిలో కుజ, శుక్రుల సంచారం.. ఆ రాశుల వారి జీవితాల్లో సంచలనాలు, ఆకస్మిక మార్పులు..!
ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు కుంభరాశిలో కుజ, శుక్రులు కలిసి సంచారం చేయబోతున్నాయి. కుజ, శుక్ర గ్రహాలు ఎక్కడ ఎప్పుడు కలిసినా ఎక్కువగా సంచలనాలే అనుభవానికి వస్తాయి. వ్యక్తిగత జీవితంలో అనేక అంశాల రూపురేఖలు మారిపోతాయి. చేతిలో ఒక్క నయా పైసా కూడా లేని వ్యక్తికి జేబు నిండా డబ్బుంటుంది. ఉద్యోగాలు లేనివారికి అప్రయత్నంగా కూడా ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు కుంభరాశిలో కుజ, శుక్రులు కలిసి సంచారం చేయబోతున్నాయి. కుజ, శుక్ర గ్రహాలు ఎక్కడ ఎప్పుడు కలిసినా ఎక్కువగా సంచలనాలే అనుభవానికి వస్తాయి. వ్యక్తిగత జీవితంలో అనేక అంశాల రూపురేఖలు మారిపోతాయి. చేతిలో ఒక్క నయా పైసా కూడా లేని వ్యక్తికి జేబు నిండా డబ్బుంటుంది. ఉద్యోగాలు లేనివారికి అప్రయత్నంగా కూడా ఉద్యోగాలు లభిస్తాయి. పెళ్లి కానివారికి పెళ్లి సంబంధం కుదురుతుంది. పెళ్లి వద్దనుకున్న వారు సైతం పెళ్లి ప్రయత్నాల పట్ల మొగ్గు చూపిస్తారు. సన్యాసులకు సైతం డబ్బు సంపాదన మీద మోజు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి జీవితాల్లో ఇటువంటి సంచలనాలు, ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి.
- మేషం: ఈ రాశివారికి 11వ స్థానంలో, అంటే లాభ స్థానంలో ఈ రెండు గ్రహాలు చేరుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆకస్మిక అధికార యోగానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కు ఏమాత్రం లోటుండదు. నెలాఖరు వరకు అనేక విధాలుగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.
- వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ, శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని విధంగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవడంతో పాటు రాబడి కూడా భారీగా పెరుగుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన దానికి మించిన ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, శుక్రుల సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల, ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి సంపన్న కుటుంబంలో సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. జనాకర్షణ బాగా పెరుగుతుంది. రాజకీయంగా కూడా ప్రాముఖ్యం ఏర్పడుతుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది.
- తుల: ఈ రాశివారికి పంచమ స్థానంలో కుజ, శుక్రుల యుతి జరగడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది.
- వృశ్చికం: ఈ రాశ్యధిపతి కుజుడు నాలుగవ స్థానంలో శుక్రుడితో యుతి చెందడం వల్ల గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మాతృమూలక ధన లాభానికి అవకాశముంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ధనం ఆర్జించడం జరుగుతుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో కుజ, శుక్రుల కలయిక వల్ల ధనపరంగా మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడడం, ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనివ్వడం, రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు, బకాయిలు వసూలు కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఊహించని విధంగా ఆర్థిక అవసరాలు తీరిపోవడమే కాకుండా, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. మాటకు, చేతకు విలువ బాగా పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశిలో కుజ, శుక్రులు కలుస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. పోటీదార్లు వెనుకడుగు వేయడం జరుగుతుంది. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం ఏర్పడుతుంది.