Horoscope Today: ఉద్యోగ జీవితంలో ఆ రాశి వారికి అనూహ్య శుభపరిణామాలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 16, 2024): మేష రాశి వారికి శనివారంనాడు వ్యక్తిగత సమస్య ఒకటి సునాయాసంగా పరిష్కారం అవుతుంది. వృషభ రాశి వారి ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఉద్యోగ జీవితంలో ఆ రాశి వారికి అనూహ్య శుభపరిణామాలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 16th March 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 16, 2024 | 5:01 PM

దిన ఫలాలు (మార్చి 16, 2024): మేష రాశి వారికి శనివారంనాడు వ్యక్తిగత సమస్య ఒకటి సునాయాసంగా పరిష్కారం అవుతుంది. వృషభ రాశి వారి ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మేష, వృషభ రాశి, మిథున రాశి సహా 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి సునాయాసంగా పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు. కొందరు మిత్రులు మీకు అండగా నిలుస్తారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది.  వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంగా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో అనూహ్యంగా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటాయి.దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లుకు బాగా డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో మీకు సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద మరింత శ్రద్ధ పెంచాల్సిన అవసరముంది. మీ ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.  ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు ఆదరణ పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలావరకు బయటపడ తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ముఖ్యమైన సమాచారం అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సమస్యలున్నా మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయంలో కాస్తంత పురోగతి ఉంటుంది. కుటుంబ విషయాలలో చిక్కులు తొలగిపోతాయి. మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. చాలాకాలంగా చేతికి అందని మొండి బాకీ వసూలు అవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగులకు అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వివాదాలు అనుకూలంగా సమసిపోతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. సమయం బాగా అనుకూలంగా ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కొన్ని ప్రయ త్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఇతరులకు మేలు జరిగే కొన్ని పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. విదేశాల నుంచి మీరు ఆశిస్తున్న శుభవార్త అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశముంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.  అనారోగ్య, రుణ సమస్యలు అదుపులో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా లబ్ధి చేకూరుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. మీరు చేస్తున్న ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వా‌షాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం లభించే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలలో లాభాల బాట పట్టడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ రాశి ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరిగే అవకాశముంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశముంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశముంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ పెంచుతారు. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటుచేసుకుంటుంది.

రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం