AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturday Puja Tips: జాతకంలో శని దోషమా.. అనుగ్రహం కోసం శనివారం ఈ పరిహారాలు చేసి చూడండి.. శుభ ఫలితాలు మీ సొంతం..

జ్యోతిషశాస్త్రంపై నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు. చాలా మంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతుంటారు. అయితే మందగమనుడు మంచి పనులు చేసే వారిపై అనుగ్రహం .. చెడు పనులు చేస్తే కష్టాలను ఇస్తాడని నమ్మకం. ముఖ్యంగా శనిశ్వరుడు ప్రతి ఒక్క రాశులోనూ  కొన్ని ఏళ్ల పాటు ఉంటూ ఆయా మనుషులు చేసే పనులకు తగిన విధంగ ఫలితాలు ఇస్తుంటాడు.అయితే శనిదేవుడికి అంకితం చేయబడిన శనివారం రోజున చేసే కొన్ని పనులతో శుభ ద్రుష్టితో శుభ ఫలితాలను ఇస్తాడని విశ్వాసం.

Saturday Puja Tips: జాతకంలో శని దోషమా.. అనుగ్రహం కోసం శనివారం ఈ పరిహారాలు చేసి చూడండి.. శుభ ఫలితాలు మీ సొంతం..
Lord Shani
Surya Kala
|

Updated on: Mar 16, 2024 | 7:23 AM

Share

నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం.. సూర్యుడి తనయుడైన శనీశ్వరుడు కర్మ ప్రదాత. మానవులు చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కనుక న్యాయాధిపతి అని కూడా అంటారు. గ్రహాల్లో అతి నెమ్మదిగా కదిలే గ్రహం కూడా శనీశ్వరుడే.. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడానికి శనీశ్వరుడు దాదాపు రెండున్నర  ఏళ్ల సమయం తీసుకుంటాడు.  కనుక శనీశ్వరుడిని మంద గమనుడు అని కూడ పిలుస్తారు. అయితే  జ్యోతిషశాస్త్రంపై నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు. చాలా మంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతుంటారు. అయితే మందగమనుడు మంచి పనులు చేసే వారిపై అనుగ్రహం .. చెడు పనులు చేస్తే కష్టాలను ఇస్తాడని నమ్మకం. ముఖ్యంగా శనిశ్వరుడు ప్రతి ఒక్క రాశులోనూ  కొన్ని ఏళ్ల పాటు ఉంటూ ఆయా మనుషులు చేసే పనులకు తగిన విధంగ ఫలితాలు ఇస్తుంటాడు.అయితే శనిదేవుడికి అంకితం చేయబడిన శనివారం రోజున చేసే కొన్ని పనులతో శుభ ద్రుష్టితో శుభ ఫలితాలను ఇస్తాడని విశ్వాసం. ఈ రోజున శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం..

  1. శనీశ్వరుడికి స్నేహితుడు హనుమంతుడు.. కనుక హనుమంతుడిని పూజించిన భక్తులపై శనీశ్వరుడి ప్రభావం పడదు. శుభ దృష్టిని కలిగి ఉంటాడు. అంతేకాదు శనివారం నాడు కాకులకు, చీమలకు, కుక్కలకు ఆహారం అందించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
  2. జాతకంలో ఉన్న శని దోష ప్రభావం తొలగిపోతుందని విశ్వాసం. కాకి శనీశ్వరుడి వాహనాల్లో ఒకటి. నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా అందించటం వలన శని శుభ అనుగ్రహం కలుగుతుంది.
  3. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్దలతో పూజించినా శనీశ్వరుడు శుభ ఫలితాలను ఇస్తాడని నమ్మకం.
  4. శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించాలి. పూజించడం వలన శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం.
  5. ఇవి కూడా చదవండి
  6. శనిదేవుడిని పూజించి జిల్లేడు పువ్వులు,  నల్లనువ్వులను సమర్పించాలి. శని అష్టకం పఠించడం వలన మేలు జరుగుతుంది.
  7. జాతకంలో శని దోషం ఉంటే శనీశ్వరుడి ఆలయంలో నూనె, నువ్వుల నూనెలతో అభిషేకం చేయాలి. నల్లని దుస్తులు సమర్పించాలి.

    శనిదేవుడికిదివ్యంగులు, పేదలు అంటే అమితమైన ఇష్టం కనుక ఆయన అనుగ్రహం కోసం పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయడం వలన అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..