Restaurant on Scooter: స్కూటర్‌పై రెస్టారెంట్… తక్కువ ధరలకు చికెన్ వెరైటీస్.. ఎక్కడో దూరంగా కాదండోయ్..
నగరంలో ఇలాంటి మొబైల్ రెస్టారెంట్ లేదు. ఇలాంటి విభిన్న ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని, వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందన్నారు. ఈ వ్యాపారం తనకు కూడా లాభసాటిగా ఉందని, త్వరలో మరిన్ని శాఖలను ఏర్పాటు చేస్తానని మణికంఠ చెప్పాడు. మిగిలిన రెస్టారెంట్లతో పోలిస్తే చికెన్ కు సంబంధించిన వెరైటీలు ఇక్కడ కాస్త తక్కువ ధరకే లభిస్తాయని అంటున్నారు.
రెస్టారెంట్‌లకు బదులుగా అనేక మొబైల్ రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. రోడ్లపై పుట్ట గొడుగుల్లా దర్శనమివ్వడం మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే, మొబైల్ రెస్టారెంట్లలోనూ వివిధ రకాలు, విభిన్న వైరేటీలు, వినూత్న రీతిలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తున్నారు వ్యాపారులు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగావకాశాలు రాకపోవడంతో కొందరు యువకులు వినూత్న ఆలోచనలతో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇక్కడ చేతక్ అనే వ్యక్తి బీబీక్యూ చికెన్ అనే ఈ మొబైల్ రెస్టారెంట్ ప్రారంభించి అందరినీ ఆకర్షిస్తున్నాడు. అతని వ్యాపార విధానం ఎలా ఉందో పూర్తి వివరాల్లోకి వెళితే..
వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ రెస్టారెంట్ చేతక్ బండి బాటసారులను ఆకర్షిస్తోంది. వరంగల్ నగరానికి చెందిన మణికంఠ అనే యువకుడు వ్యాపారం చేయాలనే కొత్త ఆలోచనతో చేతక్ బండిని తీసుకెళ్లి రంగులు వేసి ప్రజలను ఆకర్షించేలా ఏర్పాటు చేశాడు. దానిపై స్టవ్ బిగించుకుని మొబైల్ రెస్టారెంట్ మోడల్‌గా రూపొందించాడు. దీని తయారీకి దాదాపు 40వేలకు పైగా ఖర్చయిందని, చికెన్ కు సంబంధించిన పలు వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తన వద్ద లభిస్తాయని చెప్పాడు. చెస్ట్ పీస్, ఫ్రైడ్ పీస్, తందూరీ లెగ్, రెక్కలు, బోన్‌లెస్ టిక్కా వంటి వెరైటీలు ఇక్కడ తయారు చేస్తాడు. మిగిలిన రెస్టారెంట్లతో పోలిస్తే చికెన్ కు సంబంధించిన వెరైటీలు ఇక్కడ కాస్త తక్కువ ధరకే లభిస్తాయని, ధర రూ.60 లోపే ఉందని చెబుతున్నారు.
నగరంలో ఇలాంటి మొబైల్ రెస్టారెంట్ లేదు. ఇలాంటి విభిన్న ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని, వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందన్నారు. ఈ వ్యాపారం తనకు కూడా లాభసాటిగా ఉందని, త్వరలో మరిన్ని శాఖలను ఏర్పాటు చేస్తానని మణికంఠ చెప్పాడు
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..