AI Voice Call Scam: ఆపదలో ఉన్నా.. కుటుంబ సభ్యుల గొంతుతో ఫోన్ కాల్.! మరో స్కాం.

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏం చేస్తాం..? ఎలాగైనా సరే వారిని కాపాడుకోవాలనే చూస్తాం.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకుంటాం.. సరిగ్గా ఈ భావోద్వేగాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో సైబర్ నేరస్థులు కొత్త మోసానికి తెరలేపారు. స్కూలుకో, కాలేజీకో వెళ్లిన కూతురు లేదా కొడుకు గొంతును అనుకరిస్తూ ‘మమ్మీ నేను ఆపదలో ఉన్నా.. కాపాడు ప్లీజ్’ అంటూ ఏఐ సాయంతో ఫోన్ చేస్తారు.

AI Voice Call Scam: ఆపదలో ఉన్నా.. కుటుంబ సభ్యుల గొంతుతో ఫోన్ కాల్.! మరో స్కాం.

|

Updated on: Mar 14, 2024 | 4:49 PM

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏం చేస్తాం..? ఎలాగైనా సరే వారిని కాపాడుకోవాలనే చూస్తాం.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకుంటాం.. సరిగ్గా ఈ భావోద్వేగాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో సైబర్ నేరస్థులు కొత్త మోసానికి తెరలేపారు. స్కూలుకో, కాలేజీకో వెళ్లిన కూతురు లేదా కొడుకు గొంతును అనుకరిస్తూ ‘మమ్మీ నేను ఆపదలో ఉన్నా.. కాపాడు ప్లీజ్’ అంటూ ఏఐ సాయంతో ఫోన్ చేస్తారు. ఆపై మీ దగ్గరి నుంచి అందినకాడికి వసూలు చేసి కాల్ కట్ చేస్తారు. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చాక కానీ మీరు మోసపోయిన విషయం తెలియదు. తాజాగా ఓ మహిళ తనకు ఎదురైన ఇలాంటి అనుభవాన్ని ట్విట్టర్ లో పంచుకుంది. కావేరీకి ఓ రోజు మధ్యాహ్నం కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చిందట. సాధారణంగా కొత్త నెంబర్ల నుంచి వచ్చే కాల్ ను ఆమె అటెండ్ చేయరట కానీ ఈ కాల్ ను ఆన్సర్ చేశారు. కాల్ లో అవతలి వైపున్న అపరిచితుడు తనను తాను ఓ పోలీస్ ఆఫీసర్ నని పరిచయం చేసుకున్నాడు. కావేరీ వాళ్ల అమ్మాయిని, ఆమె స్నేహితులు మరో ముగ్గురిని కలిపి అరెస్టు చేశామని చెప్పాడు. వారంతా కలిసి ఆన్ లైన్ లో ఓ యువకుడిని ఛీట్ చేశారని ఆరోపించాడు. కూతురితో మాట్లాడండి అంటూ ఫోన్ వేరే వారికి అందించాడు.

కొన్ని క్షణాల తర్వాత ‘మమ్మీ నన్ను కాపాడు ప్లీజ్’ అంటూ ఓ అమ్మాయి గొంతు వినిపించిందట. ఆ వాయిస్ తన అమ్మాయి గొంతులానే ఉంది కానీ కొద్దిగా అసహజంగా అనిపించిందనీ కావేరీ ట్విట్‌లో చెప్పుకొచ్చారు. ఇంతలో మళ్లీ ఫోన్ తీసుకున్న అపరిచితుడు.. అమ్మాయిని స్టేషన్ కు తీసుకెళ్లకుండా వదిలేయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడనీ తాను చెప్పిన ఖాతాకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తే అమ్మాయిని వదిలేస్తానని చెప్పాడట. అప్పటికే ఇదొక స్కామ్ అని గుర్తించి ఫోన్ పెట్టేసినట్లు కావేరీ తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్ ఎవరికైనా రావొచ్చు. కాస్త అలర్ట్ గా ఉండండి, ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు స్థిమితంగా ఆలోచించండి అంటూ కావేరీ హెచ్చరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో