Flax seeds for Hair: జుట్టు ఆరోగ్యానికి అవిసె గింజలు.. ఇలా వాడితే నమ్మలేని కేశ సౌందర్యం మీ సొంతం..!
వాటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు కోసం అవిసె గింజలను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్‌ని నివారిస్తుంది. మీ జుట్టును బలోపేతం చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. pH స్థాయిలను సమతుల్యం చేయగలదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. జుట్టు పెరుగుదలకు అవిసె గింజలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
Flax seeds for Hair: పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అవిసె గింజలను ఫ్లాక్స్ అని కూడా పిలుస్తారు. అవి ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియంతో నిండి ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. అవిసె గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కేశ సంరక్షణకు కూడా చాలా మంచిది. జుట్టు సమస్యలకు సమర్థవంతంగా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు కోసం అవిసె గింజలను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్‌ని నివారిస్తుంది. మీ జుట్టును బలోపేతం చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. pH స్థాయిలను సమతుల్యం చేయగలదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. జుట్టు పెరుగుదలకు అవిసె గింజలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
1. జుట్టు కోసం అవిసె గింజల నూనె:
ఒక చిన్న గిన్నెలో మీ జుట్టుకు సరిపడ అవిసె గింజల నూనెను తీసుకుని దానిని కొద్దిగా వెచ్చగా మారే వరకు ఒక నిమిషం పాటు వేడియ చేయడి. అప్పుడు గ్యాస్ ఆపేసి నూనెను చల్లబర్చుకోండి. దీన్ని మీ జుట్టు, మూలాలు, తలంతటికీ సరిగ్గా అప్లై చేయండి. ఇప్పుడు, మీ జుట్టును వేడి టవల్‌తో చుట్టి సుమారు 30 నిమిషాల పాటు ఆవిరి ప్యాక్‌లా వేయండి.. ఆ తర్వాత మీ జుట్టును సాధారణ షాంపూతో కడగాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. చక్కటి మార్పు గమనిస్తారు.
2. ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ జెల్:
ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ జెల్ చేయడానికి, మీకు ¼ కప్పు అవిసె గింజలు, 2 కప్పుల ఫిల్టర్ చేసిన నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం అవసరం. పాన్‌లో నీరు పోసి అవిసె గింజలు వేసి ఉడకబెట్టింది. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత చిక్కటి జెల్‌గా మారుతుంది. అందులోనే నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇది మంచి జెల్‌గా తయారవుతుంది. అప్పుడు గ్యాస్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దానిని ఒక జార్‌లో నిల్వ చేసుకోవాలి. ఇది మీరు తలస్నానం చేయడానికి ముందు వారానికి ఒకసారి చొప్పున ఉపయోగించండి.
3. పచ్చి అవిసె గింజలను తినండి
ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టును పొందడంలో సహాయపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వాపును తగ్గిస్తాయి. విటమిన్ బి బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఇ మీ తలపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
4. కొబ్బరి నూనెతో ఫ్లాక్స్ సీడ్స్ జెల్:
దీని కోసం ఒక కప్పు నీరు, 5 టేబుల్ స్పూన్ల గోల్డెన్ ఫ్లాక్స్ సీడ్స్, ½ టీస్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ కలబంద అవసరం. నీళ్లలో అవిసె గింజలను వేసి బాగా మరిగించాలి. అప్పుడు బాగా చక్కగా మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు కంటైనర్‌లో పోయాలి. దానికి కొబ్బరినూనె, కలబందను కలపండి. దీన్ని ఒక వారం పాటు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోండి. మీ జుట్టుకు షాంపూ చేయడానికి ముందు అప్లై చేయండి.
5. హెయిర్ ప్యాక్:
మీ జుట్టు పొడి బారినట్లుగా ఉండి కాంతి విహీనంగా కనిపిస్తున్నట్టయితే, అవిసె గింజలతో చేసే హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడిని తీసుకోండి. దాంట్లో అరకప్పు పెరుగు, నాలుగు చుక్కల తేనె వేయండి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. ఈ ప్యాక్‌ని అరగంట పాటు అలా ఉంచేసుకుని తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయండి. మీ జుట్టు ఎంతో మృదువుగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..