AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Kidney Day: జర జాగ్రత్త గురూ.. పెయిన్ కిల్లర్స్ వాడితే మీ కిడ్నీలు పనిచేయవట.. ఇంకా పెను ప్రమాదమే..

World Kidney Day 2024: భారతదేశంలో కిడ్నీ వ్యాధులు చాలా సాధారణంగా మారాయి. ఎందుకంటే ఇక్కడ ఆహారం, జీవనశైలి ఈ అవయవానికి మరింత హాని కలిగిస్తుంది. అటువంటి సమస్యలలో, మూత్రపిండాల వ్యాధికి విజయవంతమైన చికిత్స అల్లోపతితో పాటు ఆయుర్వేదంతో సాధ్యమవుతుంది.. అయితే, భారతదేశంలో 7% మంది ప్రజలు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడు చేసుకుంటున్నారని AIIMS నివేదిక పేర్కొంది.

World Kidney Day: జర జాగ్రత్త గురూ.. పెయిన్ కిల్లర్స్ వాడితే మీ కిడ్నీలు పనిచేయవట.. ఇంకా పెను ప్రమాదమే..
World Kidney Day 2024
Shaik Madar Saheb
|

Updated on: Mar 14, 2024 | 11:42 AM

Share

World Kidney Day 2024: భారతదేశంలో కిడ్నీ వ్యాధులు చాలా సాధారణంగా మారాయి. ఎందుకంటే ఇక్కడ ఆహారం, జీవనశైలి ఈ అవయవానికి మరింత హాని కలిగిస్తుంది. అటువంటి సమస్యలలో, మూత్రపిండాల వ్యాధికి విజయవంతమైన చికిత్స అల్లోపతితో పాటు ఆయుర్వేదంతో సాధ్యమవుతుంది.. అయితే, భారతదేశంలో 7% మంది ప్రజలు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడు చేసుకుంటున్నారని AIIMS నివేదిక పేర్కొంది. నొప్పి నివారణ మాత్రలను ఎలాడపడితే అలా వాడడం వల్ల యువకులు కూడా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని నెఫ్రాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశంలో 10 శాతం మంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారని.. చాలా మంది రోగులు తమ వ్యాధి గురించి చాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నారని.. దీని కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల సంఖ్య పెరుగుతోందని AIIMS నివేదికలో తెలిపింది. AIIMS ఢిల్లీలోని నెఫ్రాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ భౌమిక్ ప్రకారం.. కిడ్నీకి ఉన్న అతి పెద్ద సవాలు ఏమిటంటే, దాని డ్యామేజ్‌ని చాలా ఆలస్యంగా గుర్తించడం వల్ల 70% మంది రోగులలో కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు.7% మంది పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ద్వారా కిడ్నీలకు హాని కలిగించుకుంటున్నారని పేర్కొన్నారు.

రెగ్యులర్ పరీక్షలు తప్పనిసరి..

రక్తంలో యూరియా, క్రియాటినిన్ పరీక్షలు, మూత్రాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించినట్లయితే, ఏ రకమైన మూత్రపిండాల సమస్య అయినా.. దాని ప్రారంభ సంకేతాలను గుర్తించవచ్చు. లక్షణాలు కనిపించే సమయానికి, తరచుగా చాలా ఆలస్యం అవుతుంది. కావున సాధారణ తనిఖీలు చేయడం ద్వారా మాత్రమే సమస్యను సమయానికి తెలుసుకోవచ్చు.. ముఖ్యంగా మధుమేహం లేదా రక్తపోటు ఉన్న వ్యక్తులు సాధారణంగా అనాల్జేసిక్ నెఫ్రోపతీని అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటారు. అంటే దీర్ఘకాలం పాటు పెయిన్‌కిల్లర్ ఎక్స్‌పోజర్ కారణంగా ఒకటి లేదా రెండు మూత్రపిండాలు దెబ్బతింటాయి.

ఔషధం, శస్త్రచికిత్స, డయాలసిస్, కిడ్నీల మార్పిడితో సహా మూత్రపిండాల చికిత్సకు అనేక ఎంపికలు ఉన్నప్పటికీ, తీవ్రమైన మూత్రపిండ వ్యాధి ఉన్న రోగుల జీవితాలు తరచుగా కష్టతరంగా మారుతాయి. కిడ్నీ రోగులకు కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం తరచుగా తక్కువగా ఉంటుంది. అటువంటి రోగులు ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. వారి రోగనిరోధక శక్తి కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది.

మూత్రపిండాల ప్రాముఖ్యత

మూత్రపిండాల అతి ముఖ్యమైన పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం. ఈ పనిని సరిగ్గా చేయడం కోసం.. ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం, పుష్కలంగా నీరు త్రాగటం చాలా ముఖ్యం. కిడ్నీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డిని కూడా సక్రియం చేస్తుంది. కాల్షియంను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అయితే దీని కోసం కిడ్నీకి పుష్కలంగా ప్రోటీన్, ఫైబర్, సోడియం, పొటాషియం అవసరం.. కావున సమతుల్య ఆహారం, వీలైనంత ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది.

ఆయుర్వేద – యునాని ఔషధం ప్రయోజనాలు

రోగులను పరీక్షించిన తరువాత, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ పరిశోధకులు కిడ్నీలకు ఆయుర్వేద మందులు ప్రయోజనకరంగా ఉన్నాయని కనుగొన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ప్రారంభ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఆయుర్వేద ఔషధం నీరి KFTని సూచించింది. 42 రోజుల పాటు మందు ఇచ్చిన తరువాత, ఈ రోగులలో క్రియాటినిన్ స్థాయి మెరుగుపడింది. మూత్రపిండాలు రక్తాన్ని బాగా ఫిల్టర్ చేస్తున్నట్లు కూడా కనిపించింది. ఈ పరిశోధనను ఇరాన్ మెడికల్ జర్నల్ అవిసెన్నా జర్నల్ ఆఫ్ మెడికల్ బయోకెమిస్ట్రీ ప్రచురించింది. పరిశోధన చేస్తున్న వైద్యులు ప్రకారం.. నీరి KFT అనేది 19 మూలికలతో తయారు చేయబడిన భారతీయ ఆయుర్వేద ఔషధం.. ఇందులో పునర్నవ, గోఖ్రు, వరుణ్, పలాష్, గిలోయ్ మిశ్రమంగా ఉంటాయి. ఈ ఆయుర్వేద మూలికలు కిడ్నీలను శుభ్రపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ప్రపంచ కిడ్నీ దినోత్సవం ..

మార్చి 14 ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ‘కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్-అడ్వాన్సింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు కేర్ అండ్ ఆప్టిమల్ మెడికేషన్ ప్రాక్టీస్’. గా నిర్ణయించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..