AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లన్నకు బోనాలు సమర్పణ.. ఎటు చూసినా మహిళా భక్తులే.. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే..

జగిత్యాల జిల్లా మెట్‎పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల జాతరకు వేలాది మంది హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద బోనాల జాతర అయినటువంటి ఈ జాతరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామబాద్ జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి మల్లన్నకు బోనము సమర్పించి ముక్కులు తీర్చుకుంటారు.

మల్లన్నకు బోనాలు సమర్పణ.. ఎటు చూసినా మహిళా భక్తులే.. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే..
Bonalu Fest In Jagtial
G Sampath Kumar
| Edited By: Srikar T|

Updated on: Apr 01, 2024 | 10:17 AM

Share

జగిత్యాల జిల్లా మెట్‎పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల జాతరకు వేలాది మంది హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద బోనాల జాతర అయినటువంటి ఈ జాతరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామబాద్ జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి మల్లన్నకు బోనము సమర్పించి ముక్కులు తీర్చుకుంటారు. మల్లన్నను యాదవుల కుల దైవంగా కొలుస్తారు. కానీ ఈ జాతరలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. కులాలకు అతీతంగా బోనాలు సమర్పిస్తారు. తమ కోరికను నెరవేరిస్తే పెద్దాపూర్ మల్లన్న దేవునికి భక్తులు బంగారాన్ని (బెల్లం) పంచిపెట్టడం లేదా గొర్రెలు, మేకలను సమర్పిస్తారు. దేవునికి సమర్పించిన గొర్రెలు, మేకలను ఆలయ కమిటీ టెండర్ వేసి వచ్చిన డబ్బులతో ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు. ద్యావతి పోతురాజుల ఆటపాటలు, రంగం (గావు పట్టడం) ఇక్కడ మరో ప్రత్యేకత.

వేములవాడ రాజన్న దేవాలయం తరువాత అంత మంది భక్తులు సందర్శించుకునే క్షేత్రం పెద్దాపుర్ మల్లన్న ఆలయం. డప్పు వాయిద్యాల మధ్య మల్లన్న దేవునికి వేలాది బోనాలు ఒకటేసారి దేవాలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి సమర్పిస్తారు. దాదాపు 80 వేలకు పైగా భక్తులు ఒకేసారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవునికి బోనాలు సమర్పించడం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోంది. ఇలా జరిపినట్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం దేవుని మహిమ అని భక్తులు విశ్వసిస్తారు. ఈ బోనాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు అంటున్నారు భక్తులు. ఈ బోనాల వేడుక కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్‎లో బందించారు. ఈ గ్రామంలో ప్రతి ఆదివారం, బుధవారం మల్లన్న దేవునికి పల్లకి సేవ నిర్వహిస్తారు. ఈ పల్లకి సేవలో పాల్గొనాల్సినవారు నెల రోజుల ముందు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని గ్రామాలలో ఆదివారం మాంసాహారం తినడానికి ప్రజలు ఇష్టపడతారు. కానీ ఈ గ్రామ ప్రజలు మల్లన్న దేవునిపై భక్తితో ఆదివారము ఇక్కడ మద్యపానం, మాంసాహారం సేవించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ, గ్రామపంచాయతీ పాలకవర్గం అన్ని రకాల వసతులు కల్పిస్తారు. గ్రామస్తులంతా భక్తితో జాతరకు వచ్చిన భక్తులకు సేవలు అందిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..