AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉదయాన్నే 5 గంటలకు చప్పుడు కాకుండా ఇంట్లోకి వచ్చింది.. ఆ తర్వాత

అప్రమత్తత అవసరం. మంచినీళ్లు కావాలని మీ ఇంటి తలుపు తట్టవచ్చు. ఆడపిల్లను బైక్ పంచర్ అని మీ సాయం అడగవచ్చు. ముందు వెనకా ఆలోచించకుండా నమ్మారో అంతే సంగతులు. అందుకు ఈ ఘటనలే ఉదాహారణ...

Hyderabad: ఉదయాన్నే 5 గంటలకు చప్పుడు కాకుండా ఇంట్లోకి వచ్చింది.. ఆ తర్వాత
Women (representative image)
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2024 | 8:27 PM

Share

ఎండాకాలం చల్లగాలికి మీరు బయట పడుకుంటున్నారా..? బీ అలెర్ట్. దొంగలు మీ కోసమే రాత్రంతా జాగారం చేస్తున్నారు. మంచి సమయం చూసి మిమ్మల్ని కొల్లగొట్టేందుకు రెడీగా ఉంటున్నారు. హైదరాబాద్‌లో అలాంటి ఘటనే వెలుగుచూసింది.  ఉప్పర్‌పల్లిలో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి నరసమ్మ (65) అనే మహిళ నుంచి రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లి పరారైనట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. చోరీ సమయంలో అక్కడే ఉన్న నరసమ్మ మనవరాలు సుజాత మాట్లాడుతూ.. ‘‘ఏదో అడిగే నెపంతో ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. లోపలికి రాగానే, ఆమె మా అమ్మమ్మ నుండి గొలుసు లాక్కుని పారిపోయింది. మిగిలిన కుటుంబ సభ్యులు ఆ సమయంలో నిద్రిస్తున్నారు. కేకలు విని లేచారు.  ఆమెను పట్టుకోడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది ” అని తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ బి.నాగేంద్రబాబు తెలిపారు.

వెంటాడి దోచేశారు… 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దోపిడీ ముఠా హల్‌చల్‌ చేసింది . ఉప్పర్ పల్లి చౌరస్తాలో ఓ యువకుడిని చితకబాది చైన్ స్నాచింగ్ చేసి పరారైయ్యారు. కారులో వస్తున్న యువకుడిని ఐదుగురు దోపిడీ దొంగలు వెంబడించారు. పీవీఎన్‌ఆర్‌ 182 పిల్లర్ వద్ద కారు టర్నింగ్ చేస్తుండగా ఒక్కసారి హెల్మెట్‌తో దాడి చేశారు. పిడు గుద్దుల వర్షం కురిపించి మెడలో ఉన్న 10 తులాల చైన్ స్నాచింగ్ చేసి పరారైయ్యారు దోపిడీ దొంగలు. పట్టపగలే నడి రోడ్డు పై దోపిడీ ముఠా రెచ్చిపోవడంతో వాహనదారులు, ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురవుతున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. నిందితుడిని పట్టుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వీళ్లంతా అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారూ ఉండొచ్చని అనుమానిస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..