హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం.. సేవల పూర్తి వివరాలు

హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్ళే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లే శ్రీరాముని భక్తులకు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చింది విమానయాన శాఖ.

హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం.. సేవల పూర్తి వివరాలు
Hyderabad To Ayodhya
Follow us

|

Updated on: Mar 31, 2024 | 6:10 PM

హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్ళే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లే శ్రీరాముని భక్తులకు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చింది విమానయాన శాఖ. అయోధ్య వెళ్లాలనుకునే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా ఫ్లైట్ సౌకర్యం కల్పించమని ఫిబ్రవరి 26న కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై స్పందించిన సింధియా ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ నుంచి అయోధ్యకు నడుపనున్నట్లు తెలిపారు.

విమానయాన కంపెనీలతో మాట్లాడిన సింధియా వారానికి మూడు రోజులు ప్రత్యేక ఫ్లైట్లు హైదరాబాద్ నుంచి అయోధ్యకు నడపాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రైవేట్ విమాన సర్వీసు సంస్థలు మంగళ, గురు, శని వారాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపాయి. ఈ సేవలు ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి. అడిగిన వెంటనే తమ అభ్యర్థనపై స్పందించి తెలుగు ప్రజలకు ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు సింధియాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. లేఖతో పాటు హైదరాబాద్ నుంచి అయోధ్యకు బుక్ చేసుకున్న టికెట్ కూడా జతచేశారు. దీంతో బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్న తెలుగు వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా కేంద్రం వెసులుబాటు కల్పించినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్