Chepala Pulusu: కిర్రాక్ ఆర్పీ చేపల పులుసుకు పెద్ద చిక్కు.. ఇలా అయ్యింది ఏంటి..?

నెల్లూరు నుంచి ప్రత్యేకంగా చేపల్ని తెప్పించి.. ఆ జిల్లా ప్లేవర్‌తో చేపల పులుసుని తయారు చేయిస్తున్నట్లు చెబుతున్నాడు ఆర్పీ. చేపల పులుసు, సన్న చేపల పులుసు, కొరమీను పులుసు, బొమ్మిడాయిల పులుసు, తలకాయ పులుసు, రవ్వ చేపల పులుసు వంటివి అతని కర్రీ పాయింట్‌లో లభిస్తాయట. రుచిలో గానీ..శుచిలోగానీ తగ్గేదే లేదు అంటున్నాడు.

Chepala Pulusu: కిర్రాక్ ఆర్పీ చేపల పులుసుకు పెద్ద చిక్కు.. ఇలా అయ్యింది ఏంటి..?
Pedda Reddy Chepala Pulusu
Follow us

|

Updated on: Mar 31, 2024 | 1:38 PM

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులసు పేరుతో దూసుకుపోతున్నాడు కమెడియన్ ఆర్పీ. యాక్టింగ్, షోలను కంప్లీట్‌గా పక్కనబెట్టి.. కేవలం బిజినెస్‌పైనే ఫోకస్ పెట్టాడు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాడు. ఇంట్రస్ట్ ఉన్నవారికి ఫ్రాంఛైజీలు ఇస్తున్నాడు. అయితే.. ఆర్పీ చేపల పులసు స్టార్ట్ చేసినప్పటి నుంచి.. రేటు బాగా ఎక్కువ అనే కామెంట్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఆ విషయాన్ని స్వయంగా అంగీకరిస్తున్నాడు ఆర్పీ. క్వాలిటీ చేపలు తెప్పిస్తానని.. మామిడికాయ, చింతపండు.. కూరలో వాడే మసాలాలు, దినుసులు అన్నీ.. ఏరికోరి తెస్తామని చెబుతున్నాడు. నెల్లూరు స్టైల్ వంట కాబట్టి ఆ మాత్రం ఖర్చ అవుతుందని అంటున్నాడు.

అది పక్కనబెడితే.. ఫుడ్ ఆర్డర్ పెట్టే ఆన్‌లైన్ వేదికల్లో ఆర్పీ పెట్టిన నెల్లూరు చేపల పులుసుకు దారుమైన రేటింగ్స్, కామెంట్స్ వస్తున్నాయి. పెట్టే డబ్బుకు.. వారు అందించే టేస్ట్.. క్వాంటిటీ చాలా దారుణంగా ఉందటున్నారు. క్వాలిటీ విషయంలో కూడా చాలా నిరుత్సాహపరిచారని పేర్కొంటున్నారు. అటు స్విగ్గీ, జొమాటోతో పాటు జస్ట్ డయల్ ఫ్లాట్‌ఫామ్‌లో సైతం ఇలాంటి కామెంట్సే దర్శనమిస్తున్నాయి. కావాలని ఆర్పీ టార్గెట్‌గా ఇలా ఎవరైనా చేస్తున్నారా..? లేదా జన్యూన్ రివ్యూస్ అన్నది తెలియాల్సి ఉంది.

తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లే.. ఈ తరహా ప్రచారం చేస్తున్నారని గతంలో ఫైరయ్యాడు ఆర్పీ. క్వాలిటీ లేకపోతే ప్రజలు ఎందుకు ఇంతలా ఆదరిస్తారని ప్రశ్నిస్తున్నాడు. బాగా లేకపోతే ఒకసారి తిన్నవారు మరోసారి రారు కదా అని లాజిక్ పాయింట్ మాట్లాడుతున్నాడు. తనకున్న సెలబ్రిటీ పరిచయాలతో తన నెల్లూరు చేపల పులుసుకు మంచి బ్రాండింగ్ తెచ్చకున్న ఆర్పీ.. అంతే స్థాయిలో నెట్టింట విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. మరి కామెంట్స్‌కు అతని కౌంటర్ ఏంటి అనేది వేచి చూడాలి.

Curry Review

Fish Curry

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..