AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court judgment: 11 ఏళ్ళ బాలుడి కిడ్నాప్, హత్య కేసులో వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు..!

వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితునికి వికారాబాద్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన రాజా ఖాన్(11) కిడ్నాప్‌, హత్య ఘటనలో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిందని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు.

Court judgment: 11 ఏళ్ళ బాలుడి కిడ్నాప్, హత్య కేసులో వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు..!
Court Judgement
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 31, 2024 | 1:03 PM

Share

వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితునికి వికారాబాద్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన రాజా ఖాన్(11) కిడ్నాప్‌, హత్య ఘటనలో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిందని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. రాజా ఖాన్ హత్య కేసును ఛేదించడంలో భాగస్వాములైన పోలీసులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.

మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ముందుకు సాగిన కేసు అనేక పరిణామాలు, విచారణ, సాక్ష్యుల వాంగ్మూలం ఇలా ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు సపాయి అజయ్‌ను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసు తుది వాయిదా, తీర్పు వెలువరించే సమయంలో కోర్టు హాల్‌ కిక్కిరిసింది. బాలుడి బంధువులు కోర్టు వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీర్పు చెప్పిన వెంటనే అక్కడున్న వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా, తక్కువ కాలంలో కేసును ఛేదించిన పోలీసులను, న్యాయవాదులను న్యాయమూర్తి అభినందించారు.

2022 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన అఫ్రోజ్ ఖాన్ తనయుడు 11ఏళ్ల రాజా ఖాన్ కనబడటం లేదని కొడంగల్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి కొడంగల్ SHO ఏ. రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో మిట్టిబౌలి కొడంగల్‌లోని మిట్టిబౌలికి చెందిన నిందితుడు సపాయి అజయ్ బాలుడిని కిడ్నాప్ చేసి, అత్యంత పాశవికంగా హతమార్చి, సూట్‌కేస్‌లో పెట్టి ముళ్ల పొదలల్లో పడేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విచారణ, సాక్ష్యుల వాంగ్మూలం ఇలా ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధించడం జరిగింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…