Hyderabad: నగరంలో నీటి కొరత.. వాటికి పెరిగిన డిమాండ్.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు..
నగరంలోని భూగర్భ జలాలు అడుగంటిపోయి. ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకటి రెండు షిఫ్టులలో సరఫరా సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలో జలమండలి సమస్య నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కొత్తగా 20 ఫిల్లింగ్ స్టేషన్లు , మూడో షిఫ్ట్ ఏర్పాటు చేసింది.
నగరంలోని భూగర్భ జలాలు అడుగంటిపోయి. ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకటి రెండు షిఫ్టులలో సరఫరా సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలో జలమండలి సమస్య నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కొత్తగా 20 ఫిల్లింగ్ స్టేషన్లు , మూడో షిఫ్ట్ ఏర్పాటు చేసింది. అదనపు ట్యాంకర్లు, డ్రైవర్లను సమకూర్చుకుంటున్నట్లు ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిశోర్ సూచన మేరకు జీహెచ్ఎంసీ నుంచి 200 మంది డ్రైవర్లను సమకూర్చు కుంటున్నామని.. దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ డ్రైవర్లకు నేడు జలమండలి ప్రధాన కార్యాలయంలో ఒక రోజు ఓరియెంటెషన్ ప్రోగ్రాం నిర్వహించారు. వీరంతా మూడో షిఫ్ట్ రాత్రి సమయాల్లో వాణిజ్య వినియోగదారులకు నీరు సరఫరా చేసేందుకు పనిచేయనున్నారు.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మూడో షిఫ్ట్ ప్రారంభమైంది. కమర్షియల్ ట్యాంకర్లు బుక్ చేసుకున్న వినియోగదారులకు నీటి సరఫరా చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 800 ట్రిప్పులుగా ట్యాంకర్లతో నీరు అందించారు. అంతే కాకుండా.. కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో అదనపు ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొత్త డ్రైవర్ల రాకతో, రాత్రి వేళల్లో ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉండటంతో వినియోగదారులకు జలమండలి మరిన్ని సేవలు అందించనుంది. మరో వైపు రాత్రి వేళల్లో ట్యాంకర్లు బుక్ చేసుకోవాలని వాణిజ్య వినియోగదారులకు జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్లు స్వామి, విజయరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.