AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: పొలాల బాట పట్టిన కేసీఆర్‌.. రైతులతో స్వయంగా మాట్లాడుతూ..

ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో జనగామ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్‌కు.. అడుగడుగునా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ధరావంత్‌ తండాలో.. ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌, రైతులను పరామర్శించారు. తమ గోడుకు కేసీఆర్‌ ముందు వెళ్లబోసుకున్నారు రైతులు. తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు...

KCR: పొలాల బాట పట్టిన కేసీఆర్‌.. రైతులతో స్వయంగా మాట్లాడుతూ..
KCR (File)
Narender Vaitla
|

Updated on: Mar 31, 2024 | 8:18 PM

Share

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీర్‌ పొలాల బాట పట్టారు. ఎండిపోతున్న పంటలను స్వయంగా పరిశీలించేందుకు… పొలం బాట పట్టారు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న జనగామ,సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించిన ఆయన పొలం గట్ల మీద రైతులతో ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో జనగామ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్‌కు.. అడుగడుగునా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ధరావంత్‌ తండాలో.. ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌, రైతులను పరామర్శించారు. తమ గోడుకు కేసీఆర్‌ ముందు వెళ్లబోసుకున్నారు రైతులు. తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.

జనగామజిల్లా నుంచి నేరుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి వెళ్లారు కేసీఆర్‌. వెలుగుపల్లిలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ వరి పంటను పరిశీలించిన కేసీఆర్‌… రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. గతేడాది ఇదే సమయంలో పంటలు పచ్చగా కళకళలాడేవని గుర్తు చేశారు.

అయితే, జిల్లాల పర్యటన సందర్భంగా..కేసీఆర్‌ ప్రయాణిస్తున్న బస్సును ఒకేరోజు రెండు జిల్లాల్లో పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌ కారణంగా.. తొలుత జనగామ జిల్లాలోని మొండ్రాయి చెక్‌పోస్ట్‌ దగ్గర బస్సును అనువణువూ చెక్‌ చేశారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా ఎర్కారంలో కేసీఆర్‌ బస్సును మరోసారి ఆపిన పోలీసులు .. తనిఖీ చేశాకే ముందుకు అనుమతించారు. అధికారుల తనిఖీలకు కేసీఆర్‌ కూడా సహకరించారు. కేసీఆర్‌ పర్యటనలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు… ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..