AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశంలో స్వర్ణయుగం ప్రారంభం.. రామాలయం గురించి ప్రధాని మోడీ మాటల్లో

మోడీ మాట్లాడుతూ రాముడి తత్వాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. తాను రామయ్య దర్శనం కోసం అక్కడికి చేరుకున్నప్పుడు.. భారతదేశంలో స్వర్ణయుగం ప్రారంభమైందని రాముడు తనకు చెబుతున్నట్లు అనిపించిందని ఆనాటి అనుభూతులను గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయి.. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. బాల రామయ్య దర్శన సమయంలో 140 కోట్ల మంది దేశప్రజల కలలను రాముడి కళ్లలో చూస్తున్నట్లు అనిపించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆ క్షణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.

భారతదేశంలో స్వర్ణయుగం ప్రారంభం.. రామాలయం గురించి ప్రధాని మోడీ మాటల్లో
Pm Modi On Ram Mandir
Surya Kala
|

Updated on: Apr 01, 2024 | 8:05 AM

Share

ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామమందిరం సహా పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రాముడి తత్వాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. తాను రామయ్య దర్శనం కోసం అక్కడికి చేరుకున్నప్పుడు.. భారతదేశంలో స్వర్ణయుగం ప్రారంభమైందని రాముడు తనకు చెబుతున్నట్లు అనిపించిందని ఆనాటి అనుభూతులను గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయి.. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. బాల రామయ్య దర్శన సమయంలో 140 కోట్ల మంది దేశప్రజల కలలను రాముడి కళ్లలో చూస్తున్నట్లు అనిపించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆ క్షణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.

రాంలాలా తత్వాన్ని మాటల్లో చెప్పలేను…

తెలివిగా పని చేయమని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది

ఈ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఇంకా అనేక విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని తన తల్లి గురించి కూడా ప్రస్తావించారు. తెలివితో పని చేయండి..  స్వచ్ఛతతో జీవించండి అని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేదని ఆయన అన్నారు. ఎవరికీ హాని చేయవద్దు, పేదల కోసం పని చేయమని చెప్పేదన్నారు.

భారతదేశం గుర్తింపు…విశ్వబంధువు

తాను ఏ పని చేసినా దానిని చిన్న, పెద్ద అనే తేడా చూడలేదని.. అసలు ఏ పనిని చిన్నదిగా పరిగణించలేదన్నారు మోడీ. తాను చేసే ప్రతి పనిని చాలా ముఖ్యమైనదిగా భావించానని ..  ప్రతి పని అగ్రస్థానంలో నిలబడాలని భావించే వాడిని అని చెప్పారు . ప్రపంచంలోని చిన్న దేశాలను కూడా పెద్ద దేశాలతో సమానంగా పరిగణిస్తారు. అందుకే నేడు ప్రపంచంలో భారతదేశం గుర్తింపు… విశ్వబంధువని చెప్పారు.

ఎన్డీయే కూటమి చాలా బలంగా ఉంది

బీజేపీ, ఎన్డీయే కూటమి చాలా బలమైన కూటమి అని ప్రధాని మోడీ అన్నారు. ఇది సమాజంలోని వివిధ చిన్న పెద్ద శక్తులను కలిపే సంస్థ. ఇది వివిధ ఆర్థిక , సామాజిక విభాగాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీల సంస్థ. ఎన్‌డిఎ ఒక పుష్పగుచ్ఛం.. ఈ పువ్వుల్లో ఒకొక్కటి సమాజంలోని ప్రతి వ్యక్తి తన సొంత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్న దేశ ప్రజలు

బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని అందుకే ‘మిషన్ 400’పై నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. రాజకీయ సుస్థిరత, ఓటు బలం ఎంత అవసరమో ప్రజలు గ్రహించారని అన్నారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అంటే దేశంలోని ప్రతి మూల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధాని మోడీ  అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలంటే ముందుగా ఒక్కో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మన కలల వెనుక చోదక శక్తిగా తమిళనాడు మారగల అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని చెప్పారు ప్రధాని మోడీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..