Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Paan Dosa: వింత వంటలతో మంట పుట్టిస్తున్న విక్రేతలు.. డ్రై ఫ్రూట్స్‌తో పాన్ మసాలా దోస..

కొన్ని ఆహార పదార్ధాల తయారీ చూస్తే బాబోయ్ ఈ వంటలను తినడానికేనా తయారు చేస్తున్నారు అని నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కూడా.. తాజాగా పాన్ మసాలా దోస తయారీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూరత్ రుచులు అనే స్ట్రీట్ ఫుడ్ విక్రేత  రుచికరమైన కొత్త పాన్ మసాలా దోస ను  ఆహార ప్రియులకు పరిచయం చేశాడు. ఈ తమలపాకు మసాలా దోస స్పెషల్ ఫుడ్ ఐటెమ్స్ తో తయారు చేసినట్లు తెలుస్తోంది. సాంప్రదాయ దక్షిణ భారత దోసను పాన్ మసాలా స్పైసీ టాంగ్‌తో కలిపి చీజ్ తో చేసిన ఈ వినూత్న వంటకం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Unique Paan Dosa: వింత వంటలతో మంట పుట్టిస్తున్న విక్రేతలు.. డ్రై ఫ్రూట్స్‌తో పాన్ మసాలా దోస..
Unique Paan Masala Dosa
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2024 | 9:02 AM

స్మార్ట్ ఫోన్ , సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రకరకాల ఆహార పదార్ధాల తయారీకి సంబంధించిన వీడియాలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వంటకాలు ఆకట్టుకోగా… మరికొన్ని ఆహార పదార్ధాల తయారీ చూస్తే బాబోయ్ ఈ వంటలను తినడానికేనా తయారు చేస్తున్నారు అని నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కూడా.. తాజాగా పాన్ మసాలా దోస తయారీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సూరత్ రుచులు అనే స్ట్రీట్ ఫుడ్ విక్రేత  రుచికరమైన కొత్త పాన్ మసాలా దోస ను  ఆహార ప్రియులకు పరిచయం చేశాడు. ఈ తమలపాకు మసాలా దోస స్పెషల్ ఫుడ్ ఐటెమ్స్ తో తయారు చేసినట్లు తెలుస్తోంది. సాంప్రదాయ దక్షిణ భారత దోసను పాన్ మసాలా స్పైసీ టాంగ్‌తో కలిపి చీజ్ తో చేసిన ఈ వినూత్న వంటకం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

‘పాన్ మసాలా దోస’ లేదా తమలపాకులతో చేసిన దోస పిండితో.. పెనం మీద దోసగా పోయడంతో పాన్ మసాలా దోస తయారీ ప్రారంభమవుతుంది. అనంతరం దోస మీద వెన్నని అప్లై చేసి.. తరువాత, తరిగిన టూటీ ఫ్రూట్టీ, చెర్రీస్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, ఖర్జూరాలు, అత్తి పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో సహా పలు రకాల డ్రై ఫ్రూప్ట్స్ ను టాపింగ్ చేసి అనంతరం చెఫ్ దోసపై తగిన మొత్తంలో పాన్ సిరప్ ను వేశాడు. తర్వాత దోస కాల్చి దానిని ముక్కలుగా కట్ చేసి వినియోగదారుడికి సర్వ్ చేశాడు. ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

ఒక సోషల్ మీడియా వినియోగదారు అసలు దోస పిండిలో పాన్ మసాలాను ఎందుకు కలుపుతారు?” అని ప్రశ్నించారు. అసలు ప్రయోగాల పేరుతో వంటల ప్రామాణికతను నాశనం చేస్తున్నారు” అని మరొకరు చెప్పారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చాలా మంది వినియోగదారులను షాక్‌కు గురి చేసింది. ఇలాంటి విచిత్రమైన కాంబినేషన్‌లు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సూరత్‌లోని పాన్ మసాలా దోస

మరోవైపు, కొందరు వ్యక్తులు ఈ పాన్ మసాలా దోస రెసిపీని అడుగుతున్నారు. అంతేకాదు కొత్త రుచులను ప్రయత్నించాలని తమ ఆసక్తిని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..