Watch Video: చికెన్‌ కర్రీ సరిగా వండలేదని భార్యను కిటికీలోంచి తోసేసిన భర్త.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

ఈ సంఘటన మార్చి 9 న జరిగింది. బాధిత మహిళను మరియమ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటనలో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితుడితో పాటు కొంతమంది కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన వారంతా ఘటనపై తీవ్రంగా స్పందిచారు. అలాంటి వాళ్లకు కుటుంబంలో ఉండే అర్హత లేదని

Watch Video: చికెన్‌ కర్రీ సరిగా వండలేదని భార్యను కిటికీలోంచి తోసేసిన భర్త.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Woman Thrown Off Building
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 31, 2024 | 6:53 PM

ఒక షాకింగ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ ఇంటి కిటికి నుండి కిందరోడ్డుపై పడిపోయి కనిపించింది. సదరు మహిళ రోడ్డుపై పడిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. చికెన్ సరిగ్గా వండలేదనే కారణంతో అత్తమామలు బాధిత మహిళను కొట్టి, ఇంటి కిటికీలోంచి కిందకు తోసేశారని చెబుతున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియో పాకిస్థాన్‌కు చెందినదిగా చెబుతున్నారు.. చికెన్ కర్రీ సరిగా వండలేదనే కారణంగానే మహిళను కిటికీలోంచి కిందకు విసిరేసినట్లు చెబుతున్నారు. బాధిత మహిళ రోడ్డుపై పడి కేకలు వేస్తూ కనిపించింది. చుట్టుపక్కల వారు ఇంటి నుంచి బయటకు వచ్చి మహిళకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనలో మహిళ కాలికి తీవ్ర గాయమైందని తెలిసింది.

అందిన సమాచారం ప్రకారం, లాహోర్‌లోని నోనారియన్ చౌక్‌లోని షాలిమార్ రోడ్ సమీపంలో ఈ సంఘటన మార్చి 9 న జరిగింది. బాధిత మహిళను మరియమ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటనలో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితుడితో పాటు కొంతమంది కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన వారంతా ఘటనపై తీవ్రంగా స్పందిచారు. అలాంటి వాళ్లకు కుటుంబంలో ఉండే అర్హత లేదని, అలాంటి వాళ్ల ఇళ్లలో ఆడవాళ్లకు దేవుడు ఎందుకు స్థానం ఇస్తాడు అని ఒకరు రాశారు. స్త్రీల స్థితిగతులు, వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు ఎదురవుతాయో చూస్తుంటే నిజంగా భయంగా ఉందని ఒకరు రాశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఆడవాళ్ళని ఇళ్ళ నుండి బయటకి తోసేసే హక్కు మీకు ఎవరూ ఇచ్చారని మరికొందరు వ్యాఖ్యనించారు.

ఇవి కూడా చదవండి

స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ మహిళ ఉద్దేశపూర్వకంగా కుటుంబంతో విసిగిపోయి ఆత్మహత్యకు ప్రయత్నించిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వీడియో వైరల్ మారటంతో బాధిత మహిళ భర్తను పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!