స్వర్గం కంటే అందమైన హిల్‌స్టేషన్ ఇది..! ఇక్కడ వాహనాల హారన్ మోగిస్తే అంతే సంగతి..! ఇదే కారణం..
ఈ పచ్చని హిల్ స్టేషన్ స్వర్గానికి ఏమాత్రం తక్కువ కాదు..కానీ, ఇక్కడికి గుర్రాలపై మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్దగా శబ్దాలు చేయరాదు. హార్న్ కొట్టడం పూర్తిగా నిషేధించబడింది. సముద్ర మట్టానికి 2600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ ప్రాంతంలో చూడవలసినవి చాలా ఉన్నాయి. సహజ వాతావరణంలో ప్రశాంతంగా గడపాలనుకునే వారు ఇక్కడకు వెళ్లవచ్చు. రోడ్లు చాలా ..
ఈరోజుల్లో అందరి ఇళ్లలోనూ కారు ఉండడం అనేది సర్వసాధారణం. ఎవరైనా ఎక్కడికైనా వెళితే సొంత కారులో వెళ్లడమే మంచిదని భావిస్తారు. చాలా మంది విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటే, ముందుగా సొంత కారులోనే ప్రయాణించాలని ఆలోచిస్తారు. కానీ, మీరు మీ స్వంత కారులో వెళ్ళలేని గ్రామం ఒకటి మన దేశంలోనే ఉందని తెలిస్తే నమ్ముతారా..? ఆసియాలోనే ఆటోమొబైల్ లేని ఏకైక హిల్ స్టేషన్ ఇది.. ఇది ఒక అతి చిన్న హిల్ స్టేషన్. సొంత వాహనంలో వెళ్లలేని ఆ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఈ ప్రదేశం మహారాష్ట్రలోని రాయ్‌ఘర్ జిల్లాలోని మాథెరాన్ హిల్ స్టేషన్. ఇది దేశంలోనే అతి చిన్న హిల్ స్టేషన్‌గా ప్రసిద్ధి చెందింది. కానీ, ఇక్కడ ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే..ఆసియాలోనే ఆటోమొబైల్ లేని ఏకైక హిల్ స్టేషన్ ఇదే. కారులో లేదా ఆటోమొబైల్‌లో ఇక్కడికి వెళ్లలేరు. ఎందుకంటే పర్యావరణం దృష్ట్యా ప్రభుత్వం సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. అయితే, మరీ ఇక్కడికి వెళ్లాలంటే ఎలాగో తెలుసుకుందాం..
పచ్చని హిల్ స్టేషన్ మాథెరాన్ స్వర్గానికి ఏమాత్రం తక్కువ కాదు..కానీ, ఇక్కడికి గుర్రాలపై మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్దగా శబ్దాలు చేయరాదు. హార్న్ కొట్టడం పూర్తిగా నిషేధించబడింది. సముద్ర మట్టానికి 2600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ ప్రాంతంలో చూడవలసినవి చాలా ఉన్నాయి. ముంబైకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‌కు చేరుకోవాలంటే ముందుగా కారు దిగి కొద్ది దూరం నడిచి వెళ్లాలి. ఆ తర్వాత గుర్రాలతో హిల్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మీరు లూయిసా పాయింట్ వద్ద 1.5 కి.మీ మార్గాన్ని సులభంగా కవర్ చేయవచ్చు. షార్లెట్ సరస్సు మాథెరాన్ అత్యంత అద్భుతమైన ఆకర్షణలలో ఒకటి. సహజ వాతావరణంలో ప్రశాంతంగా గడపాలనుకునే వారు ఇక్కడకు వెళ్లవచ్చు. రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్న ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో ఈ ప్రదేశం ఒకటి. ఇక్కడికి చేరుకోవడానికి మీరు టాయ్ ట్రైన్ కూడా తీసుకోవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..