Viral Video: ఆడాళ్లా మజాకా? ఎందులోనూ తగ్గేదే లేదంటూ.. మద్యం మత్తులో నడిరోడ్డుపై ఇలా..!

సోషల్ మీడియాలో, ప్రజలు మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లపై విన్యాసాలు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. వీటిలో చాలా వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పుడు అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. ఇటీవల నోయిడాలో స్టంట్లు చేస్తున్న అమ్మాయిల స్కూటర్లకు దాదాపు రూ.80 వేల చలాన్ జారీ చేసి అరెస్టులు కూడా చేశారు.

Viral Video: ఆడాళ్లా మజాకా? ఎందులోనూ తగ్గేదే లేదంటూ.. మద్యం మత్తులో నడిరోడ్డుపై ఇలా..!
Girl Bike Stunt
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 31, 2024 | 4:43 PM

రీల్స్‌ పిచ్చితో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు యువతీ యువకులు.. రీల్స్ కోసం కొందరు తమ ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నారు. అంతేకాదు.. అవతలి వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు. రీల్‌ చేస్తూ వెర్రీ వేషాలు వేస్తూ వైరల్ అయిన అమ్మాయిలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వారిని అరెస్టు జైల్లో కూడా పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. ఇక్కడి పోలీసులు అమలు చేస్తున్న చట్టాలను పట్టించుకోకుండా రీళ్లు చేసే వారు చాలా మంది ఉన్నారు. ఫిరోజాబాద్‌లో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ అమ్మాయి పోలీసు ఆంక్షలు ఏమాత్రం పట్టించుకోకుండా బైక్‌పై కూర్చొని రీలు వేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

ఈ అమ్మాయికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో సదరు యువతి బైక్‌పై వెనక్కి తిరిగి కూర్చుని మరో బైక్ రైడర్‌తో మాట్లాడుతోంది. మరో వీడియోలోఅమ్మాయి మరో ముగ్గురితో కలిసి బైక్‌పై తిరుగుతూ వీడియో తీస్తోంది. ఇలా బైక్ పై మొత్తం నలుగురు కూర్చున్నట్లుగా కనిపించే వీడియోని ఈ అమ్మాయి రీల్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరో వీడియోలో యువతి నడిరోడ్డుపై మద్యం బాటిల్‌తో తాగి రీల్ చేస్తున్నట్లు నటిస్తోంది. రీలు తీస్తూ రోడ్డుపై పడుకుంది. ఈ యువతికి సంబంధించినవి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా యాక్టివ్ అయ్యారు. ఆ అమ్మాయి పేరు రుచి సింగ్ అని, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 4 మిలియన్ల మంది ఆమెను పాలోవర్స్‌ ఉన్నారని గుర్తించారు.

ఇలాంటి ఎన్నో వీడియోలు ఈ అమ్మాయి ఖాతాలో అప్‌లోడ్ అయ్యాయి. చట్టాన్ని ఉల్లంఘించి చేసిన వీడియోకు సంబంధించి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకొని షికోహాబాద్ పోలీస్ స్టేషన్ మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఫిరోజాబాద్ పోలీసులు తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో, ప్రజలు మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లపై విన్యాసాలు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. వీటిలో చాలా వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పుడు అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. ఇటీవల నోయిడాలో స్టంట్లు చేస్తున్న అమ్మాయిల స్కూటర్లకు దాదాపు రూ.80 వేల చలాన్ జారీ చేసి అరెస్టులు కూడా చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…