AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫ్రూట్ స‌మోసా టేస్ట్ చేస్తారా..? ప్లీజ్ ఇలాంటి ఐడియాలు బయటకు చెప్పొద్దంటున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో విచిత్ర వంటకాలకు సంబంధించి.. ఆమ్లెట్‌ మోమోస్ నుంచి వాట‌ర్‌మెల‌న్ పాప్‌కార్న్‌, ద‌హి మ్యాగీ, గులాబ్ జామూన్ నూడుల్స్ వ‌ర‌కూ ఇలా ఎన్నో చిత్ర విచిత్ర ఆహార కాంబినేష‌న్‌లు ఇప్పటికే నెటిజన్లను ఆందోళనకు గురిచేయగా, అలాంటి వీడియోలు తరచూగా నెట్టింట సంద‌డి చేస్తుంటాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే మరో వెరైటీ వంటకం మీ ముందుకు వచ్చింది.

Viral Video: ఫ్రూట్ స‌మోసా టేస్ట్ చేస్తారా..? ప్లీజ్ ఇలాంటి ఐడియాలు బయటకు చెప్పొద్దంటున్న నెటిజన్లు..
Fruit Samosa
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2024 | 4:10 PM

Share

Viral Video : ఇంట‌ర్‌నెట్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అనేక ప్లాట్‌ఫామ్‌లపై ప్రజలు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. కొందరు వైరల్‌ వీడియోలు తీసి ఇక్క అప్‌లోడ్‌ చేస్తుంటారు. కొందరు చిన్నారుల వీడియోలు, మరికొందరు తమ పెంపుడు జంతువులకు సంబంధించినవి, ఇంకొందరు తమ ఇంట్లో ఉన్న మొక్కలు, చుట్టుపక్కల జరిగే సంఘటనలకు సబంధించిన వీడియోలను షేర్‌ చేస్తుంటారు. ఇంకొందరు వారు చేసే వంటకాలను వివరిస్తూ వీడియోలు చేస్తుంటారు. కొందరు మాత్రం చిత్ర విచిత్రమైన వంటకాలు చేసి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేస్తుంటారు.

సోషల్ మీడియాలో విచిత్ర వంటకాలకు సంబంధించి.. ఆమ్లెట్‌ మోమోస్ నుంచి వాట‌ర్‌మెల‌న్ పాప్‌కార్న్‌, ద‌హి మ్యాగీ, గులాబ్ జామూన్ నూడుల్స్ వ‌ర‌కూ ఇలా ఎన్నో చిత్ర విచిత్ర ఆహార కాంబినేష‌న్‌లు ఇప్పటికే నెటిజన్లను ఆందోళనకు గురిచేయగా, అలాంటి వీడియోలు తరచూగా నెట్టింట సంద‌డి చేస్తుంటాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే మరో వెరైటీ వంటకం మీ ముందుకు వచ్చింది. మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ గౌర‌వ్ ఖ‌న్నా తాను ఫ్రూట్ స‌మోసాను ఎంజాయ్ చేసిన వీడియోను నెట్టింట షేర్‌ చేశారు. దాంతో వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో గౌరవ్‌ ఖన్నా త‌న కారు సీటులోనే కూర్చుని కనిపిస్తున్నాడు. ఇతను న్యూఢిల్లీ ప‌శ్చిమ్ విహార్‌లో ఉంటానని చెబుతున్నాడు. ఆ తర్వాత తాను తింటున్న స‌మోసాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆ సమోసాలో ఏముందోన‌ని ముందుగా దాని పైపొర తీసి ప‌రిశీలినగా చూస్తు్న్నాడు. స‌మోసాలో ఆలూతో చేసిన కర్రీ మాత్రమే ఉందని చెప్పాడు. సమోసాలో ఫ్రూట్స్ లేవ‌ని చెప్పాడు. స‌మోసాలు కేవ‌లం ఆలూ స్ట‌ఫ్‌తోనే చేస్తారని, ఫ్రూట్ స‌మోసా అంటూ ఏమీ ఉండ‌దని చెప్పటం వీడియోలో కనిపించింది.  మీరు ఈ వీడియోకి ఇచ్చిన టైటిల్‌ చూసి.. ఫ్రూట్ స‌మోసా..ఏంట్రా బాబు అని ఆలోచనలో పడిపోయారు కదా..? అంటూ చివ‌ర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

దీంతో ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు. మీరు ఇలాంటి ఐడియాలు ఇవ్వ‌కండి…ఎవ‌రో ఒక‌రు ఫ్రూట్ స‌మోసా కూడా త‌యారు చేస్తార‌ని ఓ యూజ‌ర్ కామెంట్‌లో రాశారు. గౌరవ్‌ ఖన్నా మనందరినీ ఏప్రిల్‌ ఫుల్స్‌ గా మార్చేడంటూ సరదాగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
Video: మైదానంలో ఘోర ప్రమాదం.. ఒకే బంతికి రెండుసార్లు..
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి రూ.30 లక్షల వరకు బెనిఫిట్
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌!