Ayodhya: అయోధ్యకు వెళ్లే విమానంలో అరుదైన దృశ్యం..! మహిళ పైలట్‌ను చూసిన వృద్ధురాలు ఏం చేసిందంటే..?

విమానం ఎక్కిన ఒక వృద్ధురాలు, లేడీ పైలట్ మధ్య జరిగిన ఒక సన్ని వేశానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్‌ నెట్‌ వేదికగా నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. వైరల్‌ వీడియోలో వృద్ధురాలు, పైలట్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూడవచ్చు. అప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చేతులు కలుపుకుంటున్నారు.

Ayodhya: అయోధ్యకు వెళ్లే విమానంలో అరుదైన దృశ్యం..! మహిళ పైలట్‌ను చూసిన వృద్ధురాలు ఏం చేసిందంటే..?
old lady and the pilot
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 31, 2024 | 3:20 PM

విమానంలో ప్రయాణికులను స్వాగతించడం నుండి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తూ వారి గమ్యస్థానంలో దింపేంత వరకు పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి సంబంధించిన అనేక వీడియోలు గతంలో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. విమానం ఎక్కిన ఒక వృద్ధురాలు, లేడీ పైలట్ మధ్య జరిగిన ఒక సన్ని వేశానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్‌ నెట్‌ వేదికగా నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. అయోధ్యకు వెళ్లే విమానంలో ఓ వృద్ధురాలు లేడీ పైలట్‌కు నమస్కరిస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపించింది.

ఈ వీడియోను పైలట్ టీనా గోస్వామి తన సోషల్ మీడియాలో ఖాతాలో అప్‌లోడ్ చేసారు. ఆమె @pilot_mommy అనే ఇన్‌స్టాగ్రామ్ పేరు గల ఇన్‌స్ట్రా ఖాతా ద్వారా నెటిజన్లకు పరిచయం. ఓ వృద్ధ మహిళ పైలట్‌కు నమస్కరించడంతో వీడియో ప్రారంభమవుతుంది. పైలట్ ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. కానీ, ఆ పెద్దావిడ అడగకుండా నమస్కరించింది. తనను అయోధ్యకు తీసుకెళ్లేందుకు పైలట్‌ను లక్ష్మీదేవిగా భావిస్తూ నమస్కరించి ఆశీర్వదించింది సదరు వృద్ధురాలు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Teena Goswami (@pilot_mommy)

వైరల్‌ వీడియోలో వృద్ధురాలు, పైలట్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూడవచ్చు. అప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చేతులు కలుపుకుంటున్నారు. పైలట్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు, ‘నేను శ్రీ అయోధ్య ధామ్‌కు వెళ్తున్నాను. అప్పుడు ఒక మాతాజీ సగౌరవంగా అన్ని మెట్లకు నమస్కరించి విమానంలోకి ప్రవేశించడం నేను చూశాను. మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో పుణ్యక్షేత్రాలకు వెళ్లే సమయంలో మనం ప్రయాణించే వాహనాలు, వాటిని నడిపించే డ్రైవర్లకు నమస్కారిచంఏ ఆనవాయితీ ఉండేదని, ఇప్పటి ఇలాంటి నమ్మకం పట్ల ప్రజల్లో ఆసక్తి ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాశారు.

ఈ వీడియో రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది 4 లక్షలకు పైగా లైక్‌లను రాబట్టింది. ఇది ‘హృదయాన్ని హత్తుకునే రీల్’ అని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు రియాక్షన్ ఇస్తున్నారు. రాశారు. ‘సంస్కృతి మానవత్వంతో కలిసినప్పుడు వాతావరణం దివ్యంగా మారుతుందని మరొకరు రాశారు. ఇలా చాలా మంది వినియోగదారులు వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…