Hair Treatment Side Effects: షాకింగ్! సెలూన్‌లో హెయిర్ స్ట్రెయిట్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..!
ప్రతి సెషన్ తర్వాత బాధితురాలు వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టుగా చెప్పారు. జ్వరం, వెన్నునొప్పి కూడా ఉండేది. హెయిర్ స్ట్రెయిటెనింగ్ ట్రీట్‌మెంట్ సమయంలో తన నెత్తిమీద మంటగా అనిపించేదని దాని ఫలితంగా తలపై పుండ్లు కూడా వచ్చాయని చెప్పింది. దీంతో బాధిత మహిళ వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో వైద్యులు.. బాధితురాలి పరిస్థితిని బట్టి ఆమెకు అన్ని టెస్టులు నిర్వహించారు. రిపోర్ట్స్ లో ఆమె రక్తంలో క్రియాటినిన్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు.
హెయిర్ స్ట్రెయిటెనింగ్ అనేది గిరజాల జుట్టును స్మూత్‌గా, స్ట్రెయిట్‌గా మార్చే ప్రక్రియ. ఇది సొగసైన రూపాన్ని ఇస్తుంది. ఇంతకు ముందు కేవలం హీరోయిన్లు మాత్రమే జుట్టు కత్తిరింపులు చేసుకునేవారు, ఇప్పుడు సాధారణ మహిళలు కూడా అలాంటి చికిత్సలకు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హెయిర్ స్ట్రెయిట్నింగ్ చేసుకున్న ఓ మహిళకు కిడ్నీలు పాడైపోయిన ఘటన కలకలం రేపింది. హెయిర్ స్ట్రెయిటనింగ్ ట్రీట్ మెంట్ చేయించుకున్న 26 ఏళ్ల యువతికి కిడ్నీ పాడైంది..ఈ షాకింగ్ సమాచారాన్ని ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. ఇది కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ ప్రమాదాలను కూడా ప్రస్తావిస్తుంది. బాధితురాలు సెలూన్‌లో చాలాసార్లు జుట్టును స్ట్రెయిట్ చేయించుకున్నట్టుగా తెలిసింది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళ అనేక సందర్భాల్లో సెలూన్‌లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకున్నట్టుగా తెలిసింది. జూన్ 2020 నుండి ఏప్రిల్ 2021 వరకు చాలాసార్లు ఈ చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. ప్రతి సెషన్ తర్వాత బాధితురాలు వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టుగా చెప్పారు. జ్వరం, వెన్నునొప్పి కూడా ఉండేది. హెయిర్ స్ట్రెయిటెనింగ్ ట్రీట్‌మెంట్ సమయంలో తన నెత్తిమీద మంటగా అనిపించేదని దాని ఫలితంగా తలపై పుండ్లు కూడా వచ్చాయని చెప్పింది. దీంతో బాధిత మహిళ వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో వైద్యులు.. బాధితురాలి పరిస్థితిని బట్టి ఆమెకు అన్ని టెస్టులు నిర్వహించారు. రిపోర్ట్స్ లో ఆమె రక్తంలో క్రియాటినిన్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు. దాంతో పాటుగా మూత్రపిండాల వైఫల్యాన్ని గుర్తించారు. మూత్రంలో రక్తం ఉందని చెప్పడంతో ఆమెకు సీటీ స్కాన్ కూడా నిర్వహించారు.
అయితే, స్కాన్‌లో ఇన్‌ఫెక్షన్ లేదా మూత్రపిండ అవరోధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. విషయం ఏంటని మహిళను ప్రశ్నించగా ఆమె హెయిర్ స్ట్రెయిటెనింగ్ క్రీమ్‌లో గ్లైక్సిలిక్ యాసిడ్ అనే రసాయనం ఉండడం వల్ల చర్మంపై చికాకు కలుగుతుందని తేలింది. చర్మం ద్వారా కిడ్నీలోకి రసాయనం చేరి కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని వైద్యులు కూడా చెప్పారు. ఆ మహిళ ఆక్సలేట్ నెఫ్రోపతీ కారణంగా తీవ్రమైన మూత్రపిండ గాయానికి గురైంది. ఆమె మూత్రపిండ గొట్టాలలో కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు పేరుకుపోవడం వల్ల సంభవించే అరుదైన రుగ్మతగా వైద్యులు వెల్లడించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..