AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే.. మీ కోసం..!

వేసవిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. దీని కోసం మీరు ఎక్కువ నీరు త్రాగాలి. ఎండలో నడవడం వల్ల శరీరం ఎక్కువగా చెమట పట్టి డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం వేసవిలో నీటితో పాటు ద్రవ పదార్ధాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే.. మీ కోసం..!
మొటిమలు అధికంగా ఉన్నప్పుడు ఫౌండేషన్‌, పౌడర్‌ వంటివి అప్లై చేయకపోవడమే మంచిది. ఒకవేళ మేకప్‌ వేసుకుంటే రాత్రిపూట పూర్తిగా తొలగించి నిద్రకు ఉపక్రమించాలి. తల స్నానం చేసేటప్పుడు తల మీది నూనె నుదురుకు తాకి, మొటిమలు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా మొటిమలు మరింత ఎక్కువ కావొచ్చు కూడా. అందుకే మృదువైన షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. చర్మంతో పాటు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయాలి. ఆ తర్వాత వెంటనే స్నానం చేయాలి.
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2024 | 8:46 PM

Share

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. మండే ఎండలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఎండకు చర్మం ఎర్రగా మారటం, దద్దుర్లు, చెమటలు వంటి చర్మ సమస్యలు వెంటాడుతుంటాయి. అటువంటి పరిస్థితిలో సున్నితమైన చర్మం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమితో ఎదురయ్యే చర్మ సమస్యలను ఎదుర్కోవటానికి కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలను అనుసరించండి. ఇది వేసవిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్యకాంతి నుండి మీ ఛాయను రక్షిస్తుంది. ఈ వేసవి వేడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

వేసవిలో వడదెబ్బ, చర్మం ఎర్రబడడం, చికాకు, చెమటలు పట్టడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఇవన్నీ చర్మానికి అనారోగ్యకరమైనది. అటువంటి పరిస్థితిలో మీరు ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్ గ్లాసెస్, టోపీ, గొడుగు, పూర్తి చేతులు కవర్‌ అయ్యే కాటన్ బట్టలు ఉపయోగించడం మర్చిపోవద్దు. సూర్యరశ్మికి నేరుగా గురికావడం వల్ల చర్మం నల్లబడటం,చర్మం కందిపోయినట్టుగా మారుతుంది. అందుకే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ప్రయత్నించండి. ఈ సమయంలో ఎండ తీవ్రంగా ఉంటుంది. ప్రత్యక్ష సూర్యకాంతి చర్మానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దు. కొంతమందికి సూర్యరశ్మికి అలెర్జీ ఉంటుంది. వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ఎండాకాలంలో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. సన్ బర్న్, టానింగ్ వంటి సమస్యలను నివారించడానికి ఇది తోడ్పడుతుంది. సూర్యుని హానికరమైన కిరణాల నుండి మీ చర్మం రక్షించబడుతుంది. 15 నుంచి 20 నిమిషాల ముందు ముఖం, చేతులు, మెడపై సన్‌స్క్రీన్ లోషన్ రాయండి. వేసవిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. దీని కోసం మీరు ఎక్కువ నీరు త్రాగాలి. ఎండలో నడవడం వల్ల శరీరం ఎక్కువగా చెమట పట్టి డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం వేసవిలో నీటితో పాటు ద్రవ పదార్ధాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

వేసవిలో మీ శరీరాన్ని వీలైనంత వరకు ఎండ బారిన పడకుండా చూసుకోండి. సూర్యకిరణాలు కళ్లకు కూడా హానికరం. అటువంటి పరిస్థితులలో సన్ గ్లాసెస్ ఉపయోగించండి. సిల్క్‌ దుస్తులు ధరించవద్దు. ఎక్కువ చెమట పట్టినప్పుడు ఇవి చర్మానికి అంటుకుంటాయి. ఇది మీకు మరింత వేడిని కలిగిస్తుంది. ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించండి. ఇవి చెమటను కూడా సులభంగా పీల్చుకుంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..