AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఖాకీల ముందే కుప్పిగంతులా..! వన్‌వీల్‌పై బైక్‌ నడుపుతూ యువకుడి హల్‌చల్‌.. తికకుదిర్చిన పోలీసులు…?

ఓ యువకుడు పోలీసుల ఎదుటే బైక్‌పై విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, యువకుడు పోలీసుల ముందే బైక్‌ను వన్ వీల్‌పై నడుపుతూ స్టంట్స్ చేస్తూ హల్‌చల్‌ చేశాడు. సదరు యువకుడిని అడ్డుకోవాల్సిన పోలీసులు, బదులుగా అతడు చేస్తున్న స్టంట్‌ను ఆస్వాదించడం కనిపించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు..

Watch Video: ఖాకీల ముందే కుప్పిగంతులా..! వన్‌వీల్‌పై బైక్‌ నడుపుతూ యువకుడి హల్‌చల్‌.. తికకుదిర్చిన పోలీసులు...?
Kanpur Bike Stunt
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2024 | 7:19 PM

Share

ఈ రోజుల్లో యువకులు బైక్ స్టంట్‌లు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ యువత మాత్రం అవేవీ లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. చేతిలో బైక్ దొరికిందంటే చాలు..రెచ్చిపోయి స్టంట్లు చేస్తుంటారు. వారు చేస్తున్న ప్రమాదకర స్టంట్స్‌ కారణంగా వారి ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా అపాయం తలపెడుతున్నారు. అలాంటిదే ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ కనిపించాడు. అయితే, మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. వీడియోలో స్టంట్‌ చేస్తున్న యువకుడి బైక్‌ వెనకాలే.. ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు.

యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ యువకుడు పోలీసుల ఎదుటే బైక్‌పై విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, యువకుడు పోలీసుల ముందే బైక్‌ను వన్ వీల్‌పై నడుపుతూ స్టంట్స్ చేస్తూ హల్‌చల్‌ చేశాడు. సదరు యువకుడిని అడ్డుకోవాల్సిన పోలీసులు, బదులుగా అతడు చేస్తున్న స్టంట్‌ను ఆస్వాదించడం కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని గంగా బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బైకర్ చేసిన చర్యలకు రూ. 5,000 జరిమానా విధించినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మెరూన్ కలర్ షర్ట్ ధరించి బైక్ నడుపుతున్న యువకుడితో ఈ వీడియో క్లిప్‌ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే, ఇద్దరు పోలీసులు ఫ్రేమ్‌లోకి ప్రవేశించారు. వారు కూడా బైక్‌పై వెళ్తున్నారు. బైక్‌పై వెళ్తున్న యువకుడు ప్రమాదకరంగా వీలీ స్టంట్‌ను ప్రదర్శిస్తూ పోలీసుల కంటే వేగంగా పరిగెడుతున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…