ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! పైగా ఆ పశువులకు మెషీన్‌ గన్స్‌తో కాపలా.. ఎక్కడంటే..

ఆవు పేడను పోగు చేసి కాలుస్తుంటారు. దాంతో వచ్చే బూడిదను వేడి నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్‌గా ఉపయోగిస్తారు. వారి ఆహారంలో ప్రత్యేకంగా తమ ఆవుల నుండి సేకరించిన పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆవులు ఎనిమిది అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఒక్కొక్కటి రూ.41,000 విలువ పలుకుతున్నాయి. ఈ తెగకు చెందిన గోరక్షకులు ఈ ఆవులను తమ అత్యంత విలువైన సంపదగా భావిస్తారు.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! పైగా ఆ పశువులకు మెషీన్‌ గన్స్‌తో కాపలా.. ఎక్కడంటే..
African Tribe
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2024 | 3:55 PM

ప్రపంచంలో ఆవులను తమ దైవంగా భావించి ప్రతిరోజూ పూజించే ఏకైక దేశం భారతదేశం. కానీ, ఇది తప్పు..ఎందుకంటే.. గోవులను పూజించే మరో దేశం కూడా ఉంది.. అక్కడి ప్రజలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. పేడను స్నానానికి, సన్‌స్క్రీన్‌గా ఉపయోగిస్తారు. అవును వినడానికి కాస్త ఇబ్బందిగా, ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజమే.. తూర్పు మధ్య ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్‌లో ముండారి తెగ ప్రజలు ఇలాంటి వింత పద్ధతులను అనుసరిస్తున్నారు. వారి జీవనశైలి వారి విలువైన పశువుల సంరక్షణ..అందుకోసం మెషిన్ గన్లతో ఈ ఆవులను రక్షించుకుంటుంటారు.

అంకోలే వటుషి జాతికి చెందిన ఆవులను ‘రాజుల పశువులు’ అని కూడా అంటారు. ఈ ఆవులు ఎనిమిది అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఒక్కొక్కటి రూ.41,000 విలువ పలుకుతున్నాయి. ఈ తెగకు చెందిన గోరక్షకులు ఈ ఆవులను తమ అత్యంత విలువైన సంపదగా భావిస్తారు. ముండార్లకు ఆవు కేవలం జంతువు మాత్రమే కాదు వారి ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఆవులు పడుకున్నప్పుడు, దొంగతనం లేదా హత్యలు జరగకుండా గిరిజనులు మెషిన్ గన్‌లతో వాటికి కాపలాగా ఉంటారు.

ముండారి తెగ వారి ఆహారంలో ప్రత్యేకంగా తమ ఆవుల నుండి సేకరించిన పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. అంకోలే వటుషి పశువుల ఇతర శరీర ద్రవాలను కూడా ఈ పశువుల కాపరులు స్నానానికి, పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. ఆవు మూత్రం చేస్తుండగానే ముండారీ పురుషులు దాని కింద కూర్చుంటారు. అలా ఆవు మూత్రంలోని అమ్మోనియా కారణంగా వారి జుట్టు రంగు నారింజ రంగులోకి మారుతుంది.

ఇవి కూడా చదవండి

ముండారి తెగ ఆవు పేడను పోగు చేసి కాలుస్తుంటారు. దాంతో వచ్చే బూడిదను 115 డిగ్రీల వేడి నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్‌గా ఉపయోగిస్తారు. ఈ పశువుల ధర ఎక్కువగా ఉండటంతో ఈ అంకోలే వటుషి పశువులను మాంసం కోసం చంపేసే పనులు చేయరు. కానీ, ఈ గిరిజన ప్రజలు వారి బంధువులు మిత్రుల మధ్య బహుమతులు, కట్నంగా ఇచ్చిపుచ్చుకుంటుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?