Watch Video: పూరీలు చేసేందుకు ఈజీ ట్రిక్..! ఈ విషయం తెలియక ఇన్ని రోజులు కష్టపడ్డాం..!
ప్రతిరోజూ చపాతీ, పూరీ లేదా పరాఠాను ఈజీగా, తక్కువ సమయంలో తయారు చేయడానికి చాలా నైపుణ్యం, కృషి అవసరం. పూరీలు, చపాతీలు, పరాటాలు తయారు చేయడం అనేది అనుభవం లేని వంటవారికి చాలా కష్టమైన పని. పైగా టైమ్ టేకింగ్ కూడా. అలాంటి వారి కోసం మీకు ఇన్‌స్టంట్ పూరీని తయారుచేసే సింపుల్ ట్రిక్ చెప్పబోతున్నాం. ఈ ట్రిక్ మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ఇందుకోసం మీరు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో సమయాన్ని ఆదా చేసుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు, ఉపాయాలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతున్నాయి. అవి ఆహారం తయారీ విషయంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. చపాతీ, పూరీ, పరోటా వంటివి తయారు చేయాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రతిరోజూ చపాతీ, పూరీ లేదా పరాఠాను ఈజీగా, తక్కువ సమయంలో తయారు చేయడానికి చాలా నైపుణ్యం, కృషి అవసరం. పూరీలు, చపాతీలు, పరాటాలు తయారు చేయడం అనేది అనుభవం లేని వంటవారికి చాలా కష్టమైన పని. పైగా టైమ్ టేకింగ్ కూడా. అలాంటి వారి కోసం మీకు ఇన్‌స్టంట్ పూరీని తయారుచేసే సింపుల్ ట్రిక్ చెప్పబోతున్నాం. ఈ ట్రిక్ మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ఇందుకోసం మీరు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు. చపాతీ కర్ర లేకుండానే ఓ మహిళ క్షణాల్లో పూరీలు ఫాస్ట్‌గా చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఒక మహిళ పూరీలు చేసేందుకు భలే ట్రిక్ పాటించింది. ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుంది. ప్లాస్టిక్ షీట్ మీద వాటి కాస్త దూరం దూరంగా ఉంచి..వాటిపై చపాతీ పీటతో నేరుగా బలంగా నొక్కుతోంది. ఒక్కో పిండి ముద్దను అలా గట్టిగా నొక్కడంతో అవి పూరీ సైజులో వెడల్పుగా విస్తరించాయి. అలా అన్ని సిద్ధం చేసుకున్న పూరీని నూనెలో వేసి వేయించింది. అంతే గుండ్రంగా పూరీలు తయారయ్యాయి. ఈ జుగాడ్ దాదాపు అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియోను Instagram వినియోగదారు రుచీ కేవాట్ (@itz_ruchi___123) పోస్ట్ చేసారు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, “చపాతీ కర్ర అవసరం లేకుండానే పూరీలు తయారు చేయండి” అనే క్యాప్షన్ రాసి ఉంది.
View this post on Instagram
ఈ వీడియో కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేయబడింది. ఆశ్చర్యకరంగా, ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను 5 మిలియన్లకు పైగా వీక్షించారు. చాలా మంది వీడియోను లైక్ చేశారు. చాలా మంది ఈ మహిళ దేశీ జుగాఢ్‌ను అభినందిస్తున్నారు. వీడియో చూసిన తర్వాత ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు, అద్భుతమైన ఆలోచన నేను కూడా ప్రయత్నిస్తాను అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఇది ఒక గొప్ప ఆలోచన అని మరొక వ్యాఖ్యనించారు. చాలా వీడియోపై స్పందిస్తూ.. ఇంటికి ఎక్కువ మంది అతిథులు వచ్చినప్పుడు ఈ ట్రిక్ ఉపయోగపడుతుందంటూ పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…