Garden Tips: మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్ వాడుతున్నారా..? అయితే, ఇప్పుడు ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోండిలా..
మొక్కలో నీటిని నిలుపుకోవడానికి, మూలాలకు మంచి గాలిని అందిస్తుంది. కోకోపీట్‌లో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కంపోస్ట్ లేదా సేంద్రీయ ఎరువుతో కోకోపీట్ కలపడం మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. మొక్కకు వేసే మట్టితో కోకోపీట్ కలపడం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మొక్క లేదా విత్తనాలు బూజు పట్టవు. కోకోపీట్ వేయడం వల్ల గడ్డి పెరగదు. కోకో పీట్ మొక్క మూలాలను బలపరుస్తుంది.
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ హోం గార్డెన్‌లో పండ్లు, పువ్వులు, ఔషధ మూలికలను ఇష్టంగా పెంచుకుంటున్నారు. కానీ సరైన సంరక్షణ లేకుండా మొక్క బాగా పెరగదు. అందుకోసం చాలా మంది మొక్కల ఎదుగుదలకు రకరకాల ఎరువులు వాడుతుంటారు. అయినప్పటికీ మొక్క ఎదగదు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల చాలాసార్లు మొక్కలు చనిపోతుంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మొక్క పెరుగుదలను మెరుగుపర్చుకోవాలంటే.. మీరు కోకోపీట్ ఎరువులు ఉపయోగించవచ్చు. మొక్కలకు కోకోపీట్‌ని ఉపయోగించే ముందు అసలు కోకోపీట్ అంటే ఏమిటి..? ఇది మొక్కలకు ఎందుకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం.
కోకోపీట్ అంటే ఏమిటి ?
మొక్కలకు కోకోపీట్‌ని ఉపయోగించే ముందు కోకోపీట్ అంటే ఏమిటి ? మొక్కలకు ఎందుకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం. కొబ్బరి చిప్పల నుండి కోకోపీట్ తయారు చేస్తారు. దీనిని కోయిర్ అని కూడా అంటారు. మొక్క ఎదుగుదలకు ఈ ఎరువులో మరికొన్ని పోషకాలు కూడా కలుపుతారు.
కోకోపీట్ ఎలా సిద్ధం చేయాలి?
కోకోపీట్ తయారు చేయడానికి, ముందుగా ఎండిపోయిన కొబ్బరికాయలను తీసుకోండి. దాని పై తొక్క తీసి దాని నుండి కొబ్బరిని వేరు చేయండి. కొబ్బరి పీచును చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీపట్టుకోవాలి.
మొక్కలకు కోకోపీట్ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
హోం గార్డెన్‌లో కోకోపీట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కోకో పీట్ మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొక్కలో నీటిని నిలుపుకోవడానికి, మూలాలకు మంచి గాలిని అందిస్తుంది. కోకోపీట్‌లో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కంపోస్ట్ లేదా సేంద్రీయ ఎరువుతో కోకోపీట్ కలపడం మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. మొక్కకు వేసే మట్టితో కోకోపీట్ కలపడం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మొక్క లేదా విత్తనాలు బూజు పట్టవు. కోకోపీట్ వేయడం వల్ల గడ్డి పెరగదు. కోకో పీట్ మొక్క మూలాలను బలపరుస్తుంది.
కోకోపీట్ ఎలా ఉపయోగించాలి..?
మార్కెట్ నుంచి తెచ్చిన కోకో పీట్ ఇటుకలా ఉంటుంది. అలాంటప్పుడు, మీరు దానిని మొక్కకు వేసే ముందు కొంత ప్రాసెస్ చేయాలి. అందుకోసం ముందుగా ఒక బకెట్‌లో కోకోపీట్ ఇటుకలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి లేదా రెండు మగ్గుల నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుని 20 నిమిషాలు అలాగే ఉంచాలి. కాస్త వదులుగా చేసుకోవాలి. దీని తరువాత, నీటి నుండి కోకో పీట్ తొలగించి నేల మీద వేసి.. మట్టిని బాగా కలపాలి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..